TS news: సెంటిమెంట్‌ డైలాగులు కాదు.. పనిచేసే వాళ్లను గెలిపించాలి: హరీశ్‌రావు

తాజా వార్తలు

Published : 05/09/2021 01:10 IST

TS news: సెంటిమెంట్‌ డైలాగులు కాదు.. పనిచేసే వాళ్లను గెలిపించాలి: హరీశ్‌రావు

కరీంనగర్‌: ‘‘రూపాయి బొట్టు బిళ్ల గెలవాల్నా? నెలకు రూ.2016 పింఛను ఇచ్చే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గెలవాల్నా?.. ఆరవై రూపాయల గడియారం కావాలా?ఆడపిల్ల పెళ్లికి లక్షా పదహారు రూపాయలు కావాలా?. సెంటిమెంట్‌ డైలాగులు కాదు.. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇచ్చేటొళ్లు కావాలి. మనకు కల్యాణలక్ష్మీ లక్ష రూపాయాలు ఇచ్చేటొళ్లు కావాలి. బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్‌ కిట్‌ ఇచ్చేటొళ్లు కావాలే. దాని గురించి ప్రజలే ఆలోచించుకోవాలి’’ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం ఆయన హుజూరాబాద్‌లో పర్యటించారు. పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో వడ్డీలేని రుణాల చెక్కులను మంత్రి హరీశ్‌రావు పంపిణీ చేశారు. స్వశక్తి మహిళా గ్రూపులకు రూ.1,25,60,000 చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో రెండు పడక గదుల ఇళ్లు ఒక్కటి కూడా పూర్తి కాకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈటల ఏడేళ్లు మంత్రిగా ఉండి.. పేదలకు ఇళ్ల నిర్మాణం చేయలేదని అడగటం తప్పా?అని ప్రశ్నించారు. స్వంత స్థలాల్లో రెండు పడక గదుల ఇళ్లను కట్టిస్తామని హామీ ఇచ్చారు. సైదాపూర్‌-బోర్నపల్లి రోడ్డుకు రూ.ఆరు కోట్లు మంజూరు చేస్తానని ప్రకటించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని