రాజకీయంగా బలోపేతమవుతాం: కోదండరాం

తాజా వార్తలు

Updated : 11/07/2021 12:42 IST

రాజకీయంగా బలోపేతమవుతాం: కోదండరాం

హైదరాబాద్‌: ‘‘తెలంగాణ జన సమితి(తెజస) పని విధానాన్ని పార్టీ కమిటీలో సమీక్షించుకున్నాం. ప్రజా సంఘాల నుంచి రాజకీయాల్లోకి వచ్చాం.. పార్టీ నిర్మాణ లోపాలను గుర్తించి బలోపేతం అవుతాం’’ అని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అమరువీరుల ఆశయ సాధనకు తెజస కృషి చేస్తోందన్నారు. పైసలు కుమ్మరించి గెలవాలన్నదే తెరాస తాపత్రయం అని విమర్శించారు. ఆగస్టులో పార్టీ ప్లీనరీ నిర్వహించి అన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.

నిరుద్యోగం, పోడు భూములు, ప్రజా సమస్యలపై పోరాడతామని కోదండరాం తెలిపారు. ఏపీతో తెలంగాణ ప్రభుత్వం కుమ్మక్కై నీటి పంచాయితీపై నాటకమాడుతోందని ఆరోపించారు. ఆషాఢమాసం బోనాల సందర్భంగా ఆయన తెలంగాణ ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కరోనా జాగ్రత్తలతో మొక్కులు చెల్లించుకోవాలన్నారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని