
ప్రధానాంశాలు
సీఎల్పీ నేత భట్టివిక్రమార్క
గాంధీభవన్, న్యూస్‌టుడే: కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని కాంగ్రెస్ శాసనసభా పక్షనేత మల్లు భట్టివిక్రమార్క డిమాండ్ చేశారు. దీనికోసం తక్షణమే అసెంబ్లీని సమావేశపరచాలంటూ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో పంట కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తే సహించేది లేదన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆ పార్టీ నేతలను భారత్‌బంద్‌లో పాల్గొనాలని సూచించిన సీఎం కేసీఆర్.. దిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత తన వైఖరిని మార్చుకోవడం శోచనీయమని మండిపడ్డారు. ఇప్పటికైనా సీఎం స్వప్రయోజనాలను పక్కనపెట్టి రైతుల సంక్షేమం కోసం ఆలోచించాలన్నారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించండి: హైకోర్టు
- 2-1 కాదు 2-0!
- కొలిక్కి వచ్చిన దుర్గగుడి వెండి సింహాల కేసు
- రిషభ్ పంత్ కాదు.. స్పైడర్ పంత్: ఐసీసీ
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- ఇక చాలు
- ఈసారి అత్యధిక ధర పలికే ఆటగాడితడే!
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- శంషాబాద్‌లో సిరాజ్‌కు ఘన స్వాగతం..