
ప్రధానాంశాలు
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్‌కు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీచేసింది. 2016లో ఓ కార్యక్రమంలో ప్రసంగించిన దిగ్విజయ్‌సింగ్ ‘డబ్బులు వసూలు చేసుకోవడానికే ఎంఐఎం పార్టీని కొన్ని రాష్ట్రాల్లో అసదుద్దీన్ ఒవైసీ బరిలోకి దింపారని చేసిన వ్యాఖ్యలు తమ పార్టీకి, అధినేత పరువుకు భంగం కలిగించాయంటూ ఎంఐఎం నాయకుడు హుస్సేన్ అన్వర్ స్థానిక కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారణకు హాజరు కావాలన్న కోర్టు ఆదేశాలను దిగ్విజయ్ పలుమార్లు ఉల్లంఘించడంతో తాజాగా అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అనారోగ్యం కారణంగా హాజరు కాలేనని, మినహాయింపు ఇవ్వాలన్న ఆయన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. తదుపరి విచారణను మార్చి 8కి వాయిదా వేసింది.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- 40 రోజులు.. రూ.40 లక్షల అద్దె!
- పాపం ప్రియ.. షారుఖ్ తనయ..
- నేడు భారత్ బంద్
- పెళ్లిపై స్పందించిన విశాల్
- స్టార్స్‌తో శ్రీముఖి.. ఫొటోలు వైరల్
- అయ్య స్పిన్నోయ్!
- డిపాజిట్..నెలనెలా వెనక్కి...
- మొతేరా గిరగిరా.. ఇంగ్లాండ్ గిలగిల
- కోడలిపై మామ లైంగిక దాడి
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!