ప్రజలందరికీ కనీస ఆదాయం నెలకు రూ.500 జమ
close

ప్రధానాంశాలు

ప్రజలందరికీ కనీస ఆదాయం నెలకు రూ.500 జమ

తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళికలో హామీ

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని ప్రజలందరికీ కనీస ఆదాయం ఉండేలా ప్రతి నెలా ఆర్థిక సహాయం అందిస్తామని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. బుధవారం ఆమె పార్టీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. ఇందులో ‘కనీస ప్రాథమిక ఆదాయం’ అనే పథకాన్ని ప్రస్తావించారు. దీని కింద 1.6 కోట్ల జనరల్‌ కేటగిరీ కుటుంబాలకు నెలవారీ రూ.500 (ఏటా రూ.6,000) చొప్పున, ఎస్సీ/ఎస్టీ కుటుంబాలకు రూ.1,000 (ఏటా రూ.12,000) చొప్పున ఇవ్వనున్నారు. ఇది ఆ కుటుంబానికి చెందిన మహిళ బ్యాంకు ఖాతాలో నేరుగా జమకానుంది.
* ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు రూ.10 లక్షల విలువగల ‘స్టూడెంట్‌ క్రెడిట్‌ కార్డు’ ఇవ్వనున్నారు. దీనిపై ఏటా 4 శాతం వడ్డీ రేటు ఉంటుంది. తల్లిదండ్రులపై ఆధారపడకుండా ఉండేందుకే దీన్ని ప్రవేశపెట్టనున్నారు.
* రైతులకు ప్రస్తుతం ఏటా ఇస్తున్న రూ.6వేల ఆర్థిక సాయాన్ని రూ.10వేలకు పెంపు.
* రానున్న అయిదేళ్లలో కొత్తగా 10 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, రెండు వేల భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నారు.
* మహిస్య, తిలి, తుముల్‌, సాహా వంటి కులాలను ఓబీసీ జాబితాలో చేర్పించే విషయమై అధ్యయనానికి ప్రత్యేక కార్యాచరణ బృందం ఏర్పాటు.
* ఉత్తర బెంగాల్‌లోని తెరాయ్‌, దూరాస్‌ ప్రాంతాల కోసం ప్రత్యేక అభివృద్ధి మండళ్ల ఏర్పాటు.

జై సీతారాం అనడం భాజపాకు ఇష్టం ఉండదు
భాజపా నాయకులు ‘జై శ్రీరాం’ అని అంటారే తప్ప ‘జై సియా రాం’ (జై సీతారాం) అని అననీయరని మమతా బెనర్జీ విమర్శించారు. ఇందుకు ప్రజలకు అనుమతి ఇవ్వబోరని అన్నారు. ఆదివాసీలు అధికంగా ఉండే ఝార్‌గ్రాం జిల్లాలోని పలు బహిరంగ సభల్లో మాట్లాడుతూ సంతాలీ గిరిజనులు మరాంగ్‌ బురు అనే దేవుడిని ఆరాధిస్తారని, కానీ వారి చేత జై శ్రీరాం అనిపిస్తున్నారని చెప్పారు. వారు జై సియారాం అన్నా ఒప్పుకోరని విమర్శించారు. దుర్గాదేవి శక్తిమంతురాలు కావడంతో శ్రీరాముడు ఆమెకు పూజలు చేసిన విషయం రామాయణంలో ఉందని అన్నారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని