close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
యువత ఆత్మహత్యలపై సీఎం స్పందించరేం?: బండి సంజయ్‌

ఈనాడు, హైదరాబాద్‌- కోనరావుపేట, సిర్పూర్‌(టి), న్యూస్‌టుడే: సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో నియంత పాలన సాగిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్ల గొల్ల్లపల్లిలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన నిరుద్యోగి ముచ్చర్ల మహేందర్‌యాదవ్‌ కుటుంబ సభ్యులను ఆదివారం ఆయన పరామర్శించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిన యువకులకు ఉద్యోగాలు లేవని, వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సీఎం ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు. 

హరీశ్‌బాబుకు 12 రోజుల రిమాండ్‌

కుమురంభీం జిల్లాలో పోడు భూముల సమస్యను పరిష్కరించాలంటూ ఈ నెల 9న భాజపా నేత పాల్వాయి హరీశ్‌బాబు చేపట్టిన దీక్ష సందర్భంగా జరిగిన ఘర్షణలో పోలీసులు, అటవీ అధికారులకు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం హరీశ్‌బాబు, పలువురు రైతులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం వీరికి న్యాయమూర్తి 12 రోజుల రిమాండ్‌ విధించారు. అంతకుముందు హరీశ్‌బాబుకి కొవిడ్‌ పరీక్ష నిర్వహించగా నెగిటివ్‌ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ విషయమై బండి సంజయ్‌ స్పందిస్తూ కొవిడ్‌తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హరీశ్‌బాబును అరెస్టు చేశారని, ఆయనకు ఏమైనా హాని జరిగితే సీఎందే బాధ్యతని పేర్కొన్నారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు