ఆక్సిజన్‌, ఔషధాలపై ప్రశ్నిస్తూనే ఉంటాం
close

ప్రధానాంశాలు

ఆక్సిజన్‌, ఔషధాలపై ప్రశ్నిస్తూనే ఉంటాం

  దమ్ముంటే అరెస్టు చేయండి
  మోదీకి కాంగ్రెస్‌ నాయకుల సవాల్‌

దిల్లీ: టీకాలు, ఆక్సిజన్‌, ఔషధాల గురించి ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నిస్తూనే ఉంటామని కాంగ్రెస్‌ పేర్కొంది. మోదీని విమర్శిస్తూ, ప్రశ్నిస్తూ పోస్టర్లు అంటించిన కొందరిని దిల్లీ పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండించింది. తామూ అవే ప్రశ్నలు సంధిస్తామని, దమ్ముంటే అరెస్టు చేయండంటూ కాంగ్రెస్‌ నేతలు ఆదివారం సవాల్‌ విసిరారు. రాహుల్‌ గాంధీ సహా కొందరు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు ట్విటర్‌లోని తమ ప్రొఫైల్‌ చిత్రాలను మార్చారు. అందులో దేశవాసులకు వేయించాల్సిన టీకాలను విదేశాలకు ఎందుకు పంపారంటూ ప్రశ్నించారు. దమ్ముంటే తనను అరెస్టు చేయాలంటూ రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. మరో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జైరాం రమేశ్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ పీనల్‌ కోడ్‌ ప్రకారం భారత్‌ పనిచేస్తుందా.. పోస్టర్లు అంటించడం కూడా నేరమేనా అని నిలదీశారు. ‘‘నేను కూడా నా ఇంటి గోడకు రేపు పోస్టర్లు అంటిస్తాను. నన్ను కూడా అదుపులోకి తీసుకోండి’’ అని జైరాం ట్వీట్‌ చేశారు. నా టీకా, నా ఆక్సిజన్‌ ఎక్కడంటూ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పవన్‌ఖేరా ప్రశ్నించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని