భాజపాకు విరాళాల పంట
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భాజపాకు విరాళాల పంట

 రూ.785.77 కోట్లతో అగ్రస్థానం
 తెరాసకు సమకూరింది రూ.89.55 కోట్లు

ఈనాడు, దిల్లీ: జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి అత్యధిక విరాళాలు లభించాయి. రూ.785.77 కోట్లతో వరుసగా ఏడోసారి ఆ పార్టీ అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోని వివిధ పార్టీలకు 2019-20లో సమకూరిన సొమ్ముల వివరాలను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తన వెబ్‌సైట్‌ ద్వారా వెల్లడించింది. కాంగ్రెస్‌ పార్టీకి రూ.139 కోట్లు, ఎన్‌సీపీ-రూ.59 కోట్లు, సీపీఎం-రూ.19.6కోట్లు, టీఎంసీ-రూ.8కోట్లు, సీపీఐకి రూ.1.9 కోట్ల వరకు విరాళాలు వచ్చినట్లు ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ పేర్కొంది.
తెలుగు రాష్ట్రాల్లో తెరాస టాప్‌
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెరాసకు విరాళాల రూపంలో రూ.89,55,21,348 సమకూరగా, వైకాపా-రూ.8,92,45,126, తెదేపా-రూ.2,60,64,011, ఎంఐఎంకు రూ.13,85,000 వచ్చాయి. ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో రూ.89,15,29,000 వచ్చినట్లు తెరాస పేర్కొంది. రూ.20 వేల కన్నా ఎక్కువ విరాళాలు 41 మంది అందజేశారని తెలిపింది. అందులో అత్యధికంగా మంత్రి కేటీఆర్‌, కూర్మయ్య గారి నవీన్‌ రూ.2.50 లక్షల చొప్పున, కొండూరి రవీందర్‌రావు రూ.2 లక్షలు, గోవింద్‌ రవి రూ.1.51 లక్షలు అందజేశారు. వైకాపాకు వచ్చిన విరాళాల్లో అత్యధికంగా తమిళనాడు వెల్లూరుకు చెందిన జేఎస్‌ఆర్‌ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ లిమిటెడ్‌ నుంచి రూ.2.50 కోట్లు, నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన పి.శివకుమార్‌రెడ్డి రూ.కోటి, హైదరాబాద్‌ గచ్చిబౌలికి చెందిన అరిమెంద విజయశారదరెడ్డి, వరప్రసాద్‌రెడ్డిలు రూ.60 లక్షల చొప్పున అందజేశారు. తెదేపాకు చెన్నైకు చెందిన ట్రింప్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ రూ.కోటి, బలరాం వేమూరి రూ.80 లక్షలు, జనచైతన్య హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.20 లక్షలు, అనిల్‌ స్వాతి బలరాం ఫౌండేషన్‌ రూ.20 లక్షలు అందజేశాయి. ఎంఐఎంకు మహ్మద్‌ నజీబ్‌, ఎంతెఖాబ్‌ అన్సారీ, రయాజ్‌ షరీఫ్‌, ఇక్బాల్‌ ఆలం మహ్మద్‌ రూ.3 లక్షల చొప్పున విరాళాలిచ్చారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు