వచ్చే రెండేళ్లూ నేనే సీఎం: యడియూరప్ప

ప్రధానాంశాలు

వచ్చే రెండేళ్లూ నేనే సీఎం: యడియూరప్ప

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: రానున్న రెండేళ్లూ కర్ణాటకకు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని బి.ఎస్‌.యడియూరప్ప ప్రకటించారు. జిల్లాల పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం హాసనకు వెళ్లిన సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. ‘నాయకత్వ మార్పు ఉండబోదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు అరుణ్‌సింగ్‌ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్‌ షాలతో పాటు ఇతర నేతలంతా నాపై విశ్వాసాన్ని ప్రకటించటంతో బాధ్యత మరింత పెరిగింది’ అని ముఖ్యమంత్రి అన్నారు. కరోనా నియంత్రణలో అక్రమాలు, పాలన వ్యవహారాల్లో ముఖ్యమంత్రి కుమారుడి జోక్యం, నిధుల విడుదలలో జాప్యం తదితర ఆరోపణలతో భాజపా ఎమ్మెల్యేలు నాయకత్వ మార్పు కోసం డిమాండు చేస్తున్న విషయం తెలిసిందే.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని