పెగాసస్‌పై జేపీసీతో విచారణ జరిపించాలి: సీపీఐ

ప్రధానాంశాలు

పెగాసస్‌పై జేపీసీతో విచారణ జరిపించాలి: సీపీఐ

ఈనాడు, దిల్లీ: పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా ప్రతిపక్షాలు, ప్రముఖుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ)తో విచారణ చేయించి తన నిజాయతీ నిరూపించుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ డిమాండ్‌ చేశారు.  ఆయన ఆదివారం ఇక్కడ ఏపీ భవన్‌లో విలేకర్లతో మాట్లాడారు. ‘ఇందులో నిజంగా అంతర్జాతీయ కుట్ర ఉంటే దీనిపై దర్యాప్తు చేసి దోషులను పట్టుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై లేదా? ఈ ప్రభుత్వం ప్రతిపక్షాలపైనే కాకుండా మంత్రులపైనా నిఘా ఉంచింది. ఇక్కడ రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘిస్తున్నారు. అందులో మెజార్టీ సభ్యులు ఎన్డీయే పక్షాలవారే ఉంటారు. కుట్ర ఉంటే భగ్నం చేయాలి. అలాకాకుండా ప్రధాని మోదీ, అమిత్‌ షా మౌనంగా ఉంటే వారిద్దరూ కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారని భావించాల్సి వస్తుంది. దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత వారిపైనే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో మైనింగ్‌ మాఫియా రాజ్యమేలుతుంటే, తెలంగాణలో దళితబంధు పేరుతో ప్రభుత్వ డబ్బును లంచంగా ఇచ్చి ప్రజల ఓట్లు కొల్లగట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే దళితబంధును రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయాలి’ అని నారాయణ డిమాండ్‌ చేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని