హత్యాచార ఘటనను సీరియస్‌గా తీసుకోండి

ప్రధానాంశాలు

హత్యాచార ఘటనను సీరియస్‌గా తీసుకోండి

ట్విటర్‌లో సీఎంను కోరిన రేవంత్‌రెడ్డి

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కంటే రాజధానిలో చిన్నారిపై జరిగిన హత్యాచార ఘటనను సీరియస్‌గా తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. నిందితుడిని పట్టించిన వారికి రూ.10 లక్షల బహుమతి ఇస్తామని హైదరాబాద్‌ నగర పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో ఆయన స్పందిస్తూ ట్వీట్‌ చేశారు. ‘ఈ ఘోరానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు కొన్ని గంటల్లోనే అరెస్టు చేశారు’ అంటూ ఆదివారం మంత్రి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌ను ట్యాగ్‌ చేశారు. ఇంతటి అమానుష ఘటనపై మంత్రి కేటీఆర్‌ బాధ్యతారాహిత్యంగా స్పందించారని రేవంత్‌రెడ్డి విమర్శించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని