రేవంత్‌వి బెదిరింపు రాజకీయాలు: బాలరాజు

ప్రధానాంశాలు

రేవంత్‌వి బెదిరింపు రాజకీయాలు: బాలరాజు

ఈనాడు, హైదరాబాద్‌: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రాష్ట్రానికి శనిలా దాపురించారని, రాజకీయాలను కలుషితం చేస్తున్నారని ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు ధ్వజమెత్తారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌వి చిల్లర, బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలని, దందాలతో బాగా సంపాదించాలనే కుట్ర ఉంటుందని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీని నామరూపాల్లేకుండా చేసి మళ్లీ చంద్రబాబు పంచన చేరాలన్నదే రేవంత్‌ ప్రణాళికని ఆరోపించారు.

* హైదరాబాద్‌ మాజీ ఉపమేయర్‌ బాబా ఫసియొద్దీన్‌ ఆధ్వర్యంలో తెరాస విద్యార్థి, యువజన విభాగాల నాయకులు సోమవారం గన్‌పార్క్‌ వద్ద అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేశారు. స్తూపాన్ని రేవంత్‌ అపవిత్రం చేశారని విమర్శించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని