డీఎస్‌కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పరామర్శ

ప్రధానాంశాలు

డీఎస్‌కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పరామర్శ

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: చేతికి గాయమై అనారోగ్యంతో ఉన్న రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ను పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి పరామర్శించారు. పీసీసీ మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జెట్టి కుసుమకుమార్‌తో కలిసి గురువారం ఆయన హైదరాబాద్‌లోని డీఎస్‌ నివాసానికి వెళ్లి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగినట్లు సమాచారం. కాంగ్రెస్‌ను వీడడానికి కారణమైన అంశాలను డీఎస్‌.. రేవంత్‌కు వివరించినట్లు తెలిసింది. డీఎస్‌ను తెరాస కొద్ది కాలంగా దూరం పెట్టడం, ఆయన సైతం పార్టీకి దూరంగానే ఉంటూ వస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఇరువురి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

తెలంగాణ ప్రజలకు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు రేవంత్‌రెడ్డి ఒక ప్రకటనలో దసరా పండగ శుభాకాంక్షలు తెలియచేశారు. ప్రజలందరూ పండగను ఆనందోత్సాహాల నడుమ చేసుకోవాలని ఆకాంక్షించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని