హుజూరాబాద్‌ ఉపఎన్నికకు సీపీఐ దూరం: చాడ

ప్రధానాంశాలు

హుజూరాబాద్‌ ఉపఎన్నికకు సీపీఐ దూరం: చాడ

ఈనాడు, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఉపఎన్నికకు దూరంగా ఉండాలని సీపీఐ రాష్ట్ర సమితి నిర్ణయించినట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి శనివారం తెలిపారు. ఈ ఉపఎన్నికలో రాజకీయాలు, విధానాలకన్నా వ్యక్తిగత దూషణ-భూషణలు, ద్వేషం, కక్ష-కార్పణ్యాలు ప్రధానమైన తీరు ఏవగింపు కలిగిస్తోందని పేర్కొన్నారు. భాజపా పట్ల అనుసరిస్తున్న సూత్రబద్ధ సైద్ధాంతిక వ్యతిరేకతను కొనసాగిస్తామని వెల్లడించారు. ఉపఎన్నికలో నల్ల డబ్బు, మద్యం మునుపెన్నడూ ఎరుగని రీతిలో వీరవిహారం చేస్తున్నాయని ఆరోపించారు. రెండు అధికార పార్టీలు ‘నువ్వు దొంగ-నువ్వు దొంగ’ అన్న చందంగా ప్రచారం చేస్తున్నాయని, ప్రజల సమస్యల్ని విస్మరించాయని విమర్శించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని