భూ బాధితుల సమస్యలపై రాష్ట్రవ్యాప్త ఆందోళన: కోదండరాం

ప్రధానాంశాలు

భూ బాధితుల సమస్యలపై రాష్ట్రవ్యాప్త ఆందోళన: కోదండరాం

సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: వివిధ ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం తెలిపారు. సంబంధిత కార్యాచరణను రూపొందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్‌ ముందు జహీరాబాద్‌ నిమ్జ్‌ రైతులు చేపట్టిన ఆందోళనకు కోదండరాం మద్దతు తెలిపి మాట్లాడారు. సాగు భూములను కోల్పోతున్న రైతుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. తక్కువ పరిహారం ఇచ్చి వారి నుంచి భూములను తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నిమ్జ్‌ కోసం ఎకరం కూడా తీసుకోవద్దని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో కలెక్టర్‌ స్వర్ణలత రైతుల వద్దకు వచ్చి మాట్లాడారు. వారు తమ సమస్యలను ఆమెకు వివరించారు. ధర్నా అనంతరం కార్యాలయ ఆవరణలోనే రైతులతో కలిసి కోదండరాం రొట్టెలు తిన్నారు. భూములు పోతున్నాయని అధైర్య పడవద్దన్నారు. అండగా ఆందోళన చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెజస జిల్లా కన్వీనర్‌ తుల్జారెడ్డి, నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆశప్ప, నాయకులు లక్ష్మి, పాండు, శివమణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని