ఆగింది మీవల్లే.. కాదు మీవల్లనే

ప్రధానాంశాలు

ఆగింది మీవల్లే.. కాదు మీవల్లనే

హుజూరాబాద్‌లో తెరాస, భాజపా శ్రేణుల నిరసనలు

న్యూస్‌టుడే, హుజూరాబాద్‌: ‘దళిత బంధు పథకం ఆగింది మీవల్లేనంటే..కాదు మీవల్లనేనంటూ’ అటు తెరాస, ఇటు భాజపా నాయకులు మంగళవారం కూడా హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలో తమ నిరసనలను కొనసాగించారు. తెరాస ఆధ్వర్యంలో పలువురు దళిత నాయకులు భాజపా దిష్టిబొమ్మను దహనం చేయగా, పలుచోట్ల భాజపా నాయకులు ప్రభుత్వ దిష్టిబొమ్మను తగలబెట్టారు. జమ్మికుంట పట్టణంలో ఇరు పార్టీల శ్రేణులు పరస్పరం వ్యతిరేక నినాదాలతో ఆందోళన చేపట్టారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. జమ్మికుంట గ్రామీణ మండలం కోరపల్లిలో దిష్టిబొమ్మలను దహనంచేసే క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని వారిని శాంతింపజేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని