కేంద్ర, రాష్ట్ర విధానాలతో ప్రజలకు ఇక్కట్లు

ప్రధానాంశాలు

కేంద్ర, రాష్ట్ర విధానాలతో ప్రజలకు ఇక్కట్లు

ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస్‌ కృష్ణన్‌

వీణవంక, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల  పాలన విధానాలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస్‌ కృష్ణన్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్‌ జిల్లా వీణవంకలో కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకట్‌ తరఫున బుధవారం ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో భాజపా దేశ సంపదను అదానీ, అంబానీలకు దోచిపెడుతోందన్నారు. మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్‌, మల్లు రవిలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలకు కేసీఆర్‌ అనేక హామీలు ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్‌ నాయకులు ఆది శ్రీనివాస్‌, సిద్ధేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని