ఒవైసీపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలి

ప్రధానాంశాలు

ఒవైసీపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలి

అటార్నీ జనరల్‌కు అభినవ్‌ భారత్‌ కాంగ్రెస్‌ లేఖ

దిల్లీ: మహాత్మా గాంధీ హత్యలో వి.డి.సావర్కర్‌ ప్రమేయం ఉందంటూ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై ‘అభినవ్‌ భారత్‌ కాంగ్రెస్‌’ అనే మేధోమథన సంస్థ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆయనపై కోర్టు ధిక్కార చర్యలను ప్రారంభించేందుకు అనుమతించాలంటూ అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌కు లేఖ రాసింది. గాంధీ హత్యలో సావర్కర్‌పై దోష నిరూపణ జరిగిందన్న వాదన తప్పని సుప్రీంకోర్టు 2018 మార్చి 28న ఒక తీర్పులో పేర్కొన్నట్లు వివరించింది. న్యాయస్థానం ఇంత స్పష్టంగా చెప్పాక కూడా సావర్కర్‌పై ఆరోపణలు చేయడమేంటని ఈ నెల 15న ఒవైసీకి లేఖ రాసినట్లు తెలిపింది. పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో సావర్కర్‌ చిత్రపటం ఏర్పాటు చేయడాన్ని ఒవైసీ ఇటీవల తప్పుబట్టారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని