ప్లీనరీలో కేసీఆర్‌ అబద్ధాలు మాట్లాడారు: పొన్నాల

ప్రధానాంశాలు

ప్లీనరీలో కేసీఆర్‌ అబద్ధాలు మాట్లాడారు: పొన్నాల

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: తెరాస ప్లీనరీలో ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అబద్ధాలు మాట్లాడారని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. ఆయన మంగళవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేశామన్న మాటలు పచ్చి అబద్ధమన్నారు. గూగుల్‌, అమెజాన్‌ కంపెనీలు కాంగ్రెస్‌ హయాంలో పునాదులు వేస్తే మీ ఖాతాలో వేసుకుంటారా? అని ప్రశ్నించారు. హుజూరాబాద్‌ ప్రజలు అవినీతిపరులైన తెరాస, భాజపాలకు ఓట్లు వేయొద్దని విజ్ఞప్తి చేశారు.

* మూసీ కాలువలో మురికి ఎంతో..తెరాస నేతల అవినీతి అంత అని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీగౌడ్‌ విమర్శించారు. ఏడున్నరేళ్ల కాలంలో రైతు, విద్యార్థి ఆత్మహత్యలు ఆగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మొన్నటివరకు కోటి ఎకరాల మాగాణి అన్నారు...ఇప్పుడేమో వరి వేస్తే ఉరి అంటున్నారని ఎద్దేవా చేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని