close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 31/05/2020 00:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఖేల్‌ రత్నకు రోహిత్‌.. అర్జునకు ధావన్‌

అర్జునకు ఇషాంత్‌ శర్మ, దీప్తి శర్మ పేరు నామినేట్‌ 

ముంబయి: ప్రతిష్ఠాత్మక రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న పురస్కారానికి టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ పేరును బీసీసీఐ ప్రతిపాదించింది. పేసర్‌ ఇషాంత్‌ శర్మ, ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, మహిళా క్రికెటర్‌ దీప్తిశర్మను అర్జున పురస్కారాలకు నామినేట్‌ చేసింది. 2020 ఏడాదికి గాను కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖకు వీరి పేర్లను పంపించింది.

ప్రస్తుతం టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్టుకు రోహిత్‌ శర్మ వైస్‌ కెప్టెన్‌ అన్న సంగతి తెలిసిందే. క్రీజులో నిలిస్తే విధ్వంసం సృష్టించే హిట్‌మ్యాన్‌ 2019 ఏడాదికి గాను ఐసీసీ వన్డే క్రికెట్‌ పురస్కారం అందుకున్నాడు. ఒక ప్రపంచకప్‌ టోర్నీలో ఐదు శతకాలు బాదేసిన ఏకైక క్రికెటర్‌ ఘనత సొంతం చేసుకున్నాడు. టీ20ల్లో నాలుగు శతకాలు, టెస్టు ఓపెనర్‌గా అరంగేట్రంలోనే రెండు శతకాలు బాదిన తొలి క్రికెటర్‌ హిట్‌మ్యానే.

అరంగేట్రంలోనే అత్యంత వేగవంతమైన టెస్టు శతకం చేసిన రికార్డు శిఖర్ ధావన్‌కు ఉంది. ఐసీసీ ఛాంపియన్‌ ట్రోఫీలో వరుసగా రెండుసార్లు గోల్డెన్‌ బ్యాట్‌ పురస్కారం అందుకున్న ఒకే ఒక్కడు గబ్బర్‌. వన్డేల్లో అత్యంత వేగంగా 2000, 3000 పరుగులు చేసిన టీమ్‌ఇండియా ఆటగాడిగా ఘనత సాధించాడు. అత్యంత వేగంగా 4000, 5000 పరుగులు చేసిన భారత రెండో క్రికెటర్‌ సైతం అతడే కావడం గమనార్హం.

అత్యంత పిన్న వయసులోనే టీమ్‌ఇండియా తరఫున మూడు ఫార్మాట్లలో ఆడిన క్రికెటర్‌గా ఇషాంత్‌ శర్మకు రికార్డు ఉంది. ఆసియా ఆవల అత్యధిక వికెట్లు తీసిన భారత పేసర్‌ లంబూనే కావడం గమనార్హం. మహిళల క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన భారతీయ క్రికెటర్‌గా దీప్తిశర్మ రికార్డు సృష్టించింది. తన ఆల్‌రౌండ్‌ ప్రతిభతో జట్టుకు అపురూప విజయాలు అందించింది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.