ఎట్టకేలకు మైదానంలోకి చెన్నై సూపర్‌ కింగ్స్‌

తాజా వార్తలు

Updated : 04/09/2020 14:41 IST

ఎట్టకేలకు మైదానంలోకి చెన్నై సూపర్‌ కింగ్స్‌

నేటి నుంచే ప్రాక్టీస్‌.. వాళ్లు తప్ప!!

(ఫొటో: సీఎస్కే ట్విటర్‌)

ఇంటర్నెట్‌డెస్క్‌: చెన్నై సూపర్‌ కింగ్స్‌ నేటి నుంచి మైదానంలో ప్రాక్టీస్‌ చేస్తుందని ఆ జట్టు సీఈవో విశ్వనాథన్‌ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఇంతకుముందే వైరస్‌ సోకిన దీపక్‌ చాహర్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ మినహా ఆటగాళ్లందరికీ నెగటివ్‌ వచ్చిందని చెప్పారు. దీంతో ఆ ఇద్దరు మినహా మిగతా వాళ్లంతా సాధన మొదలుపెడతారన్నారు. మరోవైపు కరోనా సోకిన ఆ ఇద్దరు ఆటగాళ్లు.. 14 రోజుల క్వారంటైన్‌ సమయం పూర్తి చేసుకున్నాకే మరోసారి పరీక్షలు నిర్వహిస్తారని విశ్వనాథన్‌ పేర్కొన్నారు.

యూఏఈలో ఐపీఎల్‌ పదమూడో సీజన్‌ నిర్వహణపై స్పష్టత వచ్చాక అన్ని జట్లూ తమ ఆటగాళ్లను అప్రమత్తం చేశాయి. వారిని ప్రత్యేకంగా ఉంచుతూ కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకున్నాయి. ఈ క్రమంలోనే సీఎస్కే సైతం చెపాక్‌లో ప్రత్యేక ఫిట్‌నెస్‌ శిబిరం నిర్వహించింది. సరిగ్గా దుబాయ్‌కు వెళ్లే ముందు ఆరు రోజుల పాటు ఏర్పాటు చేసింది. అందుకోసం బయోబుడగ వాతావరణం కూడా సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలోనే చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆగస్టు 21న ప్రత్యేక విమానంలో దుబాయ్‌కు వెళ్లింది. అక్కడ నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఇద్దరు ఆటగాళ్లు 11 మంది సహాయక సిబ్బందికి వైరస్‌ సోకినట్లు తేలింది. 

ఆ వార్తతో ఒక్కసారిగా ఐపీఎల్‌పై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. ఆ జట్టును మరోవారం రోజులు క్వారంటైన్‌కు తరలించారు. సోమవారం అందరికీ  పరీక్షలు నిర్వహించారు. స్పష్టత కోసం గురువారం మరోసారి పరీక్షలు నిర్వహించారు. అయితే, దీపక్‌ చాహర్‌, రుతురాజ్‌కు మాత్రం నిబంధనల ప్రకారం 14 రోజుల ఐసోలేషన్‌ పూర్తయ్యాకే పరీక్షలు చేస్తారని విశ్వనాథన్‌ పేర్కొన్నారు. దీంతో ధోనీసేన నేటి నుంచి ప్రాక్టీస్‌ మొదలుపెట్టనుంది. ఇక మిగతా జట్లు గత వారం నుంచే సాధన ప్రారంభించిన సంగతి తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని