close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 29/05/2020 11:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గౌతమ్‌ గంభీర్‌ తండ్రి కారు చోరీ

దిల్లీ: టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌, భాజపా ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ ఇంటిముందు పార్కు చేసిన తన తండ్రి కారు చోరీకి గురైంది. ఆయన తండ్రి దీపక్‌ గంభీర్‌కు చెందిన ఎస్‌యూవీని దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై దిల్లీ పోలీసులు మాట్లాడుతూ.. రాజేంద్రనగర్‌లోని గంభీర్‌ ఇంటిముందు కారు పార్కు చేయగా గురువారం తెల్లవారుజామున చోరీకి గురైనట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, ఇప్పటికే పలు బృందాలను ఏర్పాటు చేసి దొంగను గుర్తించే పనిలో ఉన్నామన్నారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామన్నారు. గంభీర్‌ రాజేంద్రనగర్‌లోని తన నివాసంలో తండ్రితోనే కలిసి ఉంటున్నాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.