డ్రింక్స్‌ అందిస్తా.. అది నా పని: తాహిర్‌
close

తాజా వార్తలు

Updated : 15/10/2020 14:39 IST

డ్రింక్స్‌ అందిస్తా.. అది నా పని: తాహిర్‌

దుబాయ్‌: గత ఏడాది టీ20 లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన దక్షిణాఫ్రికా లెగ్‌ స్పిన్నర్‌, ప్రస్తుత చెన్నై బౌలర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ తాజా లీగ్‌లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. మైదానంలోని తమ జట్టు ఆటగాళ్లకు డ్రింక్స్‌ అందిస్తున్నాడు. తాహిర్‌ను మైదానం వెలుపల ఉంచడంపై సోషల్‌ మీడియాలో చర్చ జరగడంతో అతడు ట్విటర్‌ వేదికగా స్పందించాడు.  మైదానం లోపల ఉన్న ఆటగాళ్లకు డ్రింగ్స్‌ అందించడాన్ని చిన్నతనంగా భావించడం లేదన్నారు. గత మ్యాచ్‌ల్లో నేను లోపల ఉన్నప్పుడు చాలా మంది డ్రింక్స్‌ అందించారనీ, ఇప్పుడు వారికి తిరిగి ఇస్తున్నానని.. అందులో తప్పేముందని ప్రశ్నించాడు.

‘‘ గ్రౌండ్‌ లోపల నేనున్నప్పుడు చాలా మంది ఆటగాళ్లు నా కోసం డ్రింక్స్‌ తెచ్చేవాళ్లు. ఇప్పుడు నేను వాళ్లకిస్తున్నాను. అది నా పని. ఇప్పుడు నేను ఆడుతున్నానా? లేదా? అన్నది ముఖ్యం కాదు. నేను జట్టు కోసం పని చేస్తున్నానా? లేదా? అన్నదే కావాలి. అవకాశం వచ్చినప్పుడు కచ్చితంగా ఆడతాను. అయితే, జట్టు గెలుపే నాకు ముఖ్యం’’ అని ట్విటర్‌లో పోస్టు చేశాడు. దీంతో పలువురు క్రికెట్‌ అభిమానులు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిజమైన ఆటగాడు అంటే ఇలా ఉండాలి, రియల్‌ ఛాంపియన్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని