close

తాజా వార్తలు

Published : 11/08/2020 12:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పదేళ్లలో ఎప్పుడూ ఇలా జరగలేదు: అండర్సన్‌  

ఇంకా ఆడాలని ఉంది. ఇప్పట్లో నో రిటైర్మెంట్‌

మాంచెస్టర్‌: పాకిస్థాన్‌తో ఆడిన తొలి టెస్టులో పూర్తిగా విఫలమైన ఇంగ్లాండ్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ ఇప్పుడప్పుడే తనకు రిటైర్మెంట్‌ ప్రకటించే ఆలోచన లేదని స్పష్టం చేశాడు. ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ గెలిచినప్పటికీ అండర్సన్‌‌ విఫలంకావడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వచ్చాయి. అలాగే పాక్‌ మ్యాచ్‌లో ఒకానొక సందర్భంలో అతడు భావోద్వేగాలను నియంత్రించుకోలేక సహచరులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వీటన్నింటిపై మీడియాతో మాట్లాడుతూ‌ తనకు ఇప్పట్లో రిటైర్మెంట్‌ ఆలోచన లేదన్నాడు. 2021-2022 యాషెస్‌ సిరీస్‌ వరకూ ఆడాలని ఉందన్నాడు. ఈ ఒక్క మ్యాచ్‌లో విఫలం కావడంతో భావోద్వేగానికి గురైనట్లు చెప్పాడు. 

‘నేను విఫలమైనప్పుడు నా గురించి బయట ఏమనుకుంటున్నారో అని బాధపడుతా. గతంలో అలాంటి పరిస్థితులను అధిగమించినా ఇప్పుడు మరోలా ఉంది. ఆ మాటలను తట్టుకొని నిలబడటానికి కొత్త మార్గాలను ఆన్వేషిస్తున్నా. అలాగే ఈ వారం నాకెంతో ఫ్రస్టేటింగ్‌గా ఉంది. ఎందుకంటే నేను మంచి ప్రదర్శన చేయలేకపోయా. నా బౌలింగ్‌లో లయ కోల్పోయి ఇబ్బంది పడ్డా. నాకు తెలిసి పదేళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి. దాంతో మైదానంలో కొంత భావోద్వేగం చెందా. అలాగే టెక్నికల్ పరంగా ఏమైనా ఇబ్బందులు పడుతున్నానా అనే విషయాన్ని గమనించుకోవాలి. ఒకవేళ అదే సమస్య అయితే దాన్ని సరిచేసుకుంటా. ఇప్పుడు నా ధ్యాసంతా తర్వాతి టెస్టుపైనే ఉంది. అందులో కచ్చితంగా ఆడతాననే ఆశిస్తున్నా. అప్పుడైనా నేనేంటో నిరూపించుకోవాలని ఉంది’ అని అండర్సన్‌ పేర్కొన్నాడు. 

మరోవైపు గత టెస్టులో చేసిన ప్రదర్శనే మళ్లీ పునరావృతం చేస్తే అప్పుడు రిటైర్మెంట్‌ సంగతి కచ్చితంగా తన చేతుల్లో ఉండదని వ్యాఖ్యానించాడు. ఆ తర్వాత సెలెక్టర్లు తనను ఎంపిక చేయరని చెప్పాడు. అయితే, ప్రతీ ఒక్కరూ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారని, తానేమీ అందుకు మినహాయింపు కాదని చెప్పాడు. సానుకూలంగా ఆలోచిస్తూ ముందుకు సాగిపోతానని తెలిపాడు. ఒకవేళ తాను మంచిగా ఆడినా ఫలితం మరోలా వస్తే చేయాల్సింది ఏమీ లేదన్నాడు. ఇదిలా ఉండగా, అండర్సన్‌ ఇప్పటివరకు ఇంగ్లాండ్‌ జట్టు తరఫున 154 టెస్టులు ఆడి 590 వికెట్లు తీశాడు. అలాగే 194 వన్డేల్లో 269 వికెట్లు పడగొట్టాడు. తాజాగా పాక్‌తో జరిగిన టెస్టులో కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే తీయడంతో విమర్శలపాలయ్యాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.