close

తాజా వార్తలు

Published : 22/10/2020 15:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తాడోపేడో తేల్చేదెవరో..!

నేడు రాజస్థాన్‌ను ఢీకొట్టనున్న హైదరాబాద్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ముందడుగు వేయాలంటే తప్పక గెలవాల్సిన స్థితిలో ఉన్న రెండు జట్లు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ఏడో స్థానంలో ఉన్న హైదరాబాద్‌, ఆరో స్థానంలో ఉన్న రాజస్థాన్‌ మధ్య మ్యాచ్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో గెలిచిన జట్టు ప్లేఆఫ్స్‌ వైపు అడుగెస్తే.. ఓడిన జట్టు ఇంటిముఖం పట్టే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో ఈరోజు రాత్రి 7.30గంటలకు దుబాయ్‌ వేదికగా హైదరాబాద్‌, రాజస్థాన్‌ మధ్య మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రెండు జట్ల బలాబలాలేంటో ఓసారి చూద్దాం..

రికార్డులు ఏం చెబుతున్నాయి..
* ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 12 మ్యాచుల్లో తలపడ్డాయి. అందులో ఆరేసి విజయాలు నమోదు చేశాయి. ఈ సీజన్‌లో జరిగిన మ్యాచ్‌లో మాత్రం రాజస్థాన్‌ 5 వికెట్ల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది.
* ఈ మైదానంలో రాజస్థాన్‌కు చెత్త రికార్డు ఉంది. 5 మ్యాచులాడి నాలుగింట్లో ఓడింది. కేవలం ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించింది. ఇక్కడ ఆడిన మ్యాచుల్లో హైదరాబాద్‌ జట్టు ఏడింట్లో నాలుగు గెలిచింది. మూడింట్లో ఓటమిపాలైంది.

దుబాయ్‌ పిచ్‌ బౌలర్లకు అనుకూలించే అవకాశం ఉంది. ఛేదన జట్టు చెమటోడ్చాల్సి రావచ్చు. మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టు 160-170పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే పోరాడే అవకాశం ఉంటుంది.

విలియమ్సన్‌ స్థానంలో హోల్డర్‌..?
గత సీజన్‌లో బ్యాటింగ్‌తో భయపెట్టిన హైదరాబాద్‌ జట్టు ఈసారి బ్యాటింగ్‌లోనే బలహీనంగా తయారైంది. సులభమైన లక్ష్యాన్ని కూడా ఛేదించలేక మ్యాచ్‌లను ప్రత్యర్థికి సమర్పించుకుంటోంది. గత మ్యాచ్‌లో చివరి వరకూ పోరాడినా.. సూపర్‌ ఓవర్‌లో మంచి హిట్టర్‌ లేని కారణంగా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయితే.. ఇప్పటికే బ్యాటింగ్‌లో కాస్త బలహీనంగా కనిపిస్తున్న హైదరాబాద్‌కు విలియమ్సన్‌ గాయం కలవరపెడుతోంది. ఈ మ్యాచ్‌లో కేన్‌ రిజర్వ్‌బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. అతని స్థానంలో విండీస్‌ ఆల్‌రౌండర్‌ హోల్డర్‌ను తీసుకోవచ్చు. అతను బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌ కూడా చేయగలడు. బౌలింగ్‌లో రషీద్‌ఖాన్‌, నటరాజన్‌ ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఆత్మవిశ్వాసంతో రాజస్థాన్‌..
రెండు వరుస ఓటముల తర్వాత వచ్చిన గెలుపుతో రాజస్థాన్‌లో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. బట్లర్‌ ఫామ్‌లోకి రావడంతో ఆ జట్టు మరింత బలంగా తయారైంది. కెప్టెన్‌ స్మిత్‌ కూడా కెప్టెన్‌ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఆఖర్లో రాహుల్ తెవాతియా మంచి ముగింపు ఇస్తున్నాడు. అయితే.. భారీ అంచనాలతో జట్టులోకి వచ్చిన ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ ఇంతవరకు తనస్థాయి ప్రదర్శన ఇవ్వలేదు. మరోవైపు సీజన్‌ ప్రారంభంలో రాణించిన యువ బ్యాట్స్‌మన్‌ సంజు శాంసన్‌ మళ్లీ ఓ భారీ ఇన్నింగ్స్‌ ఆడాల్సి ఉంది. ఆరుగురు బౌలర్లున్న రాజస్థాన్‌కు బౌలింగ్‌లో పెద్ద సమస్యలేమి కనిపించడం లేదు.

జట్లు(అంచనా)
రాజస్థాన్: రాబిన్‌ ఉతప్ప, స్టోక్స్, సంజు శాంసన్, స్మిత్(కెప్టెన్), బట్లర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాతియా, జోఫ్రా ఆర్చర్, శ్రేయస్​ గోపాల్, అంకిత్‌ రాజ్‌పుత్‌, కార్తిక్​ త్యాగి.

హైదరాబాద్: డేవిడ్ వార్నర్(కెప్టెన్), బెయిర్‌స్టో, మనీశ్‌పాండే,  విలియమ్సన్‌/హోల్డర్‌,  ప్రియమ్ గార్గ్, విజయ్ శంకర్, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, నటరాజన్.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.