close

తాజా వార్తలు

ఎన్‌సీఏలో బోర్‌ కొట్టదట : శిఖర్‌ ధావన్‌

బాలీవుడ్‌ పాటకు పాండ్య, ధావన్‌, ఇషాంత్‌ చిందులు

బెంగుళూరు: కివీస్‌తో టెస్టు సిరీస్‌కు దూరమైన టీమ్‌ ఇండియా క్రికెటర్లు.. హార్దిక్‌ పాండ్య, శిఖర్‌ ధావన్‌, ఇషాంత్‌ శర్మ ప్రస్తుతం జాతీయ క్రికెట్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. ఈ సందర్భంగా అక్కడ జిమ్‌లో సాధన చేస్తున్న ఒక వీడియోను ధావన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ‘పునరావాస కేంద్రంలో బోర్‌ కొడుతుందని ఎవరన్నారు?ఇక్కడ మేం సికందర్లం’ అంటూ పాండ్య, ఇషాంత్‌ను ట్యాగ్‌ చేశాడు. ఆ వీడియోలో క్రికెటర్లు సాధన చేస్తూనే ఎంజాయ్‌ చేస్తున్నారు. బాలీవుడ్‌ సినిమాలోని ఓ పాటకు చిందులేస్తూ కసరత్తులు చేశారు. పాండ్య భంగ్రా స్టెప్పులేయగా, ధావన్‌ సైక్లింగ్‌పై డ్యాన్స్‌ చేశాడు. అలాగే ఇషాంత్‌ ఒక కర్రను పైకెత్తి గంతులేశాడు. ఈ వీడియో నవ్వులు పంచుతోంది.



Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.