
తాజా వార్తలు
రెండో వన్డేలో ఆడతాననుకోలేదు
సిడ్నీ: భారత్‌తో రెండో వన్డేలో బరిలో దిగుతానని అనుకోలేదని ఆ మ్యాచ్‌లో సెంచరీ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్ చెప్పాడు. ‘‘రెండో వన్డేకు ముందు నా ఆరోగ్యం సరిగా లేదు. తల తిరిగింది. తిన్నగా కూర్చోలేకపోయా. బరిలో దిగుతానా అనే అనుమానం కలిగింది. అటు ఇటు తిరిగినా పరిస్థితిలో మార్పు రాలేదు. చెవి లోపలి పొరల్లో ఏర్పడిన ఇబ్బంది వల్ల కలిగిన పరిణామాలివి. ఈ స్థితిలో జట్టు వైద్యుడు లీ గోల్డింగ్ కొన్ని వ్యాయామాలు చేయించాడు. చెవి నుంచి చిన్న రాళ్లు బయటకు తీయడంతో మళ్లీ మామూలు స్థితికి వచ్చా. అలాంటి పరిస్థితి నుంచి మ్యాచ్ ఆడి సిరీస్‌ను గెలిపించే సెంచరీ కొట్టడం చాలా ఆనందంగా అనిపించింది’’ అని స్మిత్ చెప్పాడు. తొలి వన్డేలో 66 బంతుల్లో 105 పరుగులు చేసిన స్టీవ్.. రెండో వన్డేలో 64 బంతుల్లో 104 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. రెండో వన్డేలో ఫీల్డింగ్‌లోనూ రాణించిన స్మిత్.. శ్రేయస్ అయ్యర్‌ను ఓ మెరుపు క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- మహా నిర్లక్ష్యం
- అలా చేస్తే భారత్‌దే విజయం: గావస్కర్
- చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
- వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు
- ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు
- అఫ్గాన్ కార్లకు ‘39’ నంబర్ ఉండబోదు.. ఎందుకంటే?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
