చాహల్‌ అని పిలవాలా లేక చుహా అనాలా?
close

తాజా వార్తలు

Published : 23/07/2020 22:47 IST

చాహల్‌ అని పిలవాలా లేక చుహా అనాలా?

అతడికి ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పిన యువరాజ్‌ సింగ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ ఎంతో హుషారైన క్రికెటర్‌. తన అల్లరి చేష్టలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. మైదానంలో ఎంత చురుగ్గా ఉంటాడో మైదానం బయట కూడా అదే విధంగా ఉంటాడు. ఇక లాక్‌డౌన్‌ వేళ తన వీడియోలతో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అలాగే  ఏ క్రికెటర్‌ లైవ్‌ సెషన్‌లోకి వచ్చినా వారి మధ్యలో చేరి సరదా కామెంట్లతో అలరించాడు. అలాంటి చిలిపి క్రికెటర్‌ పుట్టిన రోజు నేడు. గురువారం 30వ జన్మదినంలోకి అడుగుపెట్టగా టీమ్‌ఇండియా క్రికెటర్లు అతడికి శుభాకాంక్షలు చెప్పారు. 

సహచర స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌, ఓపెనర్లు రోహిత్‌శర్మ, శిఖర్‌ ధావన్‌తో పాటు హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి సైతం చాహల్‌కు బర్త్‌డే విషెస్‌ చెప్పారు. అలాగే మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ తనదైన శైలిలో ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పాడు. ‘యుజువేంద్ర చాహల్‌ అని పిలవాలా లేక మిస్టర్‌ చుహా అనాలా? నువ్వు మరింత బరువు పెరిగేందుకు ప్రత్యేక శుభాకాంక్షలు. నీ సరదా వీడియోలు, కామెంట్లతో మమ్మల్ని అలరిస్తూ ఉండు. హ్యాపీబర్త్‌ డే చాహల్‌’ అని పోస్టు చేశాడు. ఇదిలా ఉండగా, చాహల్‌ కొన్నేళ్లుగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమ్ఇండియాకు ప్రధాన స్పిన్నర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 52 వన్డేలు, 42 టీ20లు ఆడిన అతడు 91, 55 వికెట్లు తీశాడు. అలాగే ఐపీఎల్‌లో 84 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ స్పిన్నర్‌ 100 వికెట్లతో దూసుకుపోతున్నాడు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని