BCCI: దేశీయ ఆటగాళ్లకు బీసీసీఐ గుడ్‌న్యూస్‌.. మ్యాచ్‌ ఫీజు పెంపు

తాజా వార్తలు

Published : 21/09/2021 01:35 IST

BCCI: దేశీయ ఆటగాళ్లకు బీసీసీఐ గుడ్‌న్యూస్‌.. మ్యాచ్‌ ఫీజు పెంపు

దిల్లీ: దేశవాళీ టోర్నీల్లో ఆడే క్రికెటర్లకు భారత క్రికెట్‌ బోర్డు(బీసీసీఐ) శుభవార్త చెప్పింది. మ్యాచ్‌ ఫీజును పెంచుతున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జై షా సోమవారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ఇకపై 40 మ్యాచ్‌ల కంటే ఎక్కువ ఆడిన సీనియర్‌ ఆటగాళ్లకు రూ.60వేలు, అండర్‌- 23 ప్లేయర్లకు రూ.25వేలు, అండర్‌-19 ఆటగాళ్లకు రూ.20వేలు మ్యాచ్ ఫీజు ఇవ్వనున్నట్లు తెలిపారు. సోమవారం జరిగిన బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

దీంతో పాటు కరోనా కారణంగా కోల్పోయిన గత సీజన్‌కు గానూ.. ఆటగాళ్లకు మ్యాచ్‌ ఫీజులో 50శాతం పరిహారం కింద ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 2019-20 దేశవాళీ సీజన్‌లో పాల్గొన్న క్రికెటర్లకు 2020-21 సీజన్‌కు గానూ ఈ పరిహారం అందనున్నట్లు చెప్పారు. కొవిడ్‌ నేపథ్యంలో బీసీసీఐ గతేడాది రంజీ ట్రోఫీని రద్దు చేసిన విషయం తెలిసిందే. 

ప్రస్తుతం సీనియర్‌ దేశీయ క్రికెటర్లు రంజీ లేదా విజయ్‌ హజారే ట్రోఫీలకు గానూ మ్యాచ్‌కు రూ.35వేల చొప్పున ఫీజు అందుకుంటున్నారు. ఇక ముస్తఖ్‌ అలీ ట్రోఫీ అయితే గేమ్‌కు రూ.17,500చొప్పున బీసీసీఐ ఆటగాళ్లకు చెల్లిస్తోంది. ఈ ఏడాది అక్టోబరు 20 నుంచి ముస్తఖ్‌ అలీ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఆ తర్వాత నవంబరు 16, 2021 నుంచి ఫిబ్రవరి 19, 2022 రంజీ ట్రోఫీ, ఫిబ్రవరి 23, 2022 నుంచి మార్చి 26, 2022 వరకు విజయ్‌ హజారే ట్రోఫీ జరగనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని