Ganguly: దాదా @ 49.. ఈ 10 విశేషాలు మీకు తెలుసా!

తాజా వార్తలు

Published : 08/07/2021 12:00 IST

Ganguly: దాదా @ 49.. ఈ 10 విశేషాలు మీకు తెలుసా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత క్రికెట్‌కు పూర్తిగా అంకితమైపోయాడు సౌరవ్‌ గంగూలీ. ఒకప్పుడు ఆటగాడిగా దుమ్మురేపాడు. ఆపై జట్టు సారథిగా అదరగొట్టాడు. ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నాడు. ఏదో ఒక విధంగా అభిమానులను అలరిస్తున్న దాదా నేడు (జులై 8) 49వ వసంతంలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా కోల్‌కతా రాకుమారుడి పది ఆసక్తికర విశేషాలు మీ కోసం..!

  • అంతర్జాతీయ వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన తొమ్మిదో ఆటగాడు సౌరవ్‌ గంగూలీ. భారతీయుల్లో మూడో వ్యక్తి. మొత్తంగా 11,363 పరుగులు చేశాడు. సచిన్‌ తెందూల్కర్‌, విరాట్‌ కోహ్లీ తర్వాతి స్థానంలో నిలిచాడు.
  •  నిజానికి దాదాది కుడిచేతి వాటం. రాయడం, బౌలింగ్‌ చేయడం కుడిచేత్తోనే. అతడి సోదరుడు స్నేహాశీష్‌ ఎడమ చేతి వాటం ఆటగాడు. అతడి కిట్‌ను ఉపయోగిస్తూ అదే శైలి అలవాటు చేసుకున్నాడు.
  •  వన్డేల్లో వరుసగా నాలుగు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచులు గెలిచిన ఏకైక వీరుడు గంగూలీ ఒక్కడే. 1997, సెప్టెంబర్‌ 14-21 మధ్యన పాక్‌పై అందుకున్నాడు.
  •  గంగూలీ శతకాలు చేసిన ఏ టెస్టు మ్యాచులోనూ టీమ్‌ఇండియా ఓడిపోలేదు. 12 మ్యాచులు డ్రా అవ్వగా నాలుగింట్లో విజేతగా ఆవిర్భవించింది.
  •  జట్టులోంచి తొలగించినప్పటికీ టెస్టుల్లో దాదా సగటు ఎప్పటికీ 40 కిందకు పడిపోలేదు. కెరీర్లో 42.17 సగటుతో అతడు 7,212 పరుగులు చేశాడు.
  •  టీమ్‌ఇండియా కెప్టెన్‌గా అత్యుత్తమ బౌలింగ్‌ గణాకాలు నమోదు చేసిందీ గంగూలీయే. 2000, డిసెంబర్‌ 11న కాన్పూర్‌ వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచులో 10-1-32-5 గణాంకాలు నమోదు చేశాడు. వన్డేల్లో 10వేల పరుగులు, 100 వికెట్లు, 100 క్యాచులు అందుకున్న ఆరుగురు క్రికెటర్లలో దాదా ఒకరు.
  •  అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రంలో (ఇంగ్లాండ్‌పై) సెంచరీ చేసి ఆఖరి టెస్టు ఇన్నింగ్స్‌లో తొలి బంతికే (ఆస్ట్రేలియాపై) ఔటైన ఒకే ఒక్క బ్యాటర్‌ గంగూలీ.
  •  బీసీసీఐ అధ్యక్షుడైన రెండో క్రికెటర్‌ సౌరవ్‌. 1954లో విజయనగరం మహారాజు(పూసపాటి విజయ ఆనంద గజపతి రాజు)ఆ పదవిని అలంకరించారు. సునిల్‌ గావస్కర్‌, శివలాల్‌ యాదవ్‌ తాత్కాలిక అధ్యక్షులుగా సేవలందించారు.
  •  విదేశాల్లో అత్యంత విజయవంతమైన భారత టెస్టు సారథి గంగూలీ. 28 మ్యాచులకు సారథ్యం వహించగా 11 గెలిచాడు.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని