అప్పుడు 42.. ఇప్పుడు 36
close

తాజా వార్తలు

Updated : 19/12/2020 16:35 IST

అప్పుడు 42.. ఇప్పుడు 36

ఇంటర్నెట్‌ డెస్క్‌ : భారత టెస్టు క్రికెట్‌ చరిత్రలో మరో ఘోర పరాజయం పాలైంది.  ఆసీస్‌తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో భారత్‌ ఓటమి చెందింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా 36/ 9 మాత్రమే చేయడంతో  ఓటమి తప్పలేదు. గతంలోనూ భారత్‌ ఇలాంటి దారుణ పరాభవాన్ని చవి చూసింది. 1974లో లార్డ్స్‌ వేదికగా భారత్‌ vs ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 9 వికెట్ల నష్టానికి 42 పరుగులు సాధించి ఓడిపోయింది.  ఆ మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 629 పరుగులు సాధించగా భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 302 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 42 పరుగులు సాధించి ఇన్నింగ్స్‌ 285 పరుగుల తేడాలో ఓటమిని మూటకట్టుకుంది.  అప్పటి నుంచి టెస్టుల్లో భారత్‌ సాధించిన అత్యల్పస్కోరు ఇదే. అప్పట్లోనూ తాజా మ్యాచ్‌లోనూ 9 వికెట్లు కోల్పోవడం విశేషం. 1974 మ్యాచ్‌లో అజిత్‌ వాడేకర్‌ భారత కెప్టెన్‌గా ఉన్నారు. అప్పట్లో సోల్కర్‌ నాటౌట్‌గా నిలిచి  18 పరుగుల సాధించారు. ఆ ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్ల స్కోరులో అదే అత్యధికం. భారత చివరి బ్యాట్స్‌మెన్‌ బీఎస్‌ చంద్రశేఖర్‌ గాయం కారణంగా బ్యాటింగ్‌ చేయలేదు.

ఇవీ చదవండి

బుమ్రా అలా గొప్పలు చెప్పుకుంటాడు 

విరుష్క.. ఆసీస్‌లో బిడ్డను కనండి!

ఆసీస్‌ దెబ్బకు కుప్పకూలిన భారత్‌.. 36/9

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని