ఇదేం.. ఫీల్డింగ్‌?

తాజా వార్తలు

Updated : 29/03/2021 09:00 IST

ఇదేం.. ఫీల్డింగ్‌?

పుణె: ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత ఫీల్డింగ్‌ సవ్యంగా సాగి ఉంటే మ్యాచ్‌ చివరి ఓవర్‌ వరకూ వచ్చేదే కాదు. మ్యాచ్‌ను ఆఖరి బంతి వరకూ తీసుకొచ్చిన సామ్‌ కరన్‌ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను హార్దిక్‌ అందుకోలేకపోయాడు. 22 పరుగుల వద్ద ఉన్నపుడు ఇన్నింగ్స్‌ 34వ ఓవర్లో ప్రసిద్ధ్‌ బౌలింగ్‌లో అతనిచ్చిన క్యాచ్‌ను నేలపాలు చేశాడు. అంతకుముందు ఇన్నింగ్స్‌ అయిదో ఓవర్లోనే భువీ బౌలింగ్‌లో చేతుల్లో పడ్డ స్టోక్స్‌ క్యాచ్‌నూ హార్దిక్‌ పట్టలేకపోయాడు. ఆ తర్వాత 11వ ఓవర్లో నటరాజన్‌ బౌలింగ్‌లో స్టోక్స్‌ ఔటయ్యాక.. ఉపశమనం పొందినట్లు మైదానంలో మెకాళ్లపై వంగి బౌలర్‌కు, ధావన్‌కు దండాలు పెడుతూ కనిపించాడు. అయితే అదే హార్దిక్‌.. మొయిన్‌ అలీ క్యాచ్‌ను ముందుకు డైవ్‌ చేస్తూ అందుకోవడం విశేషం. మరోవైపు రనౌట్‌ చేసే అవకాశాలను భారత్‌ వృథా చేసుకుంది. ఒక్క త్రో కూడా వికెట్లకు తాకలేదు. చివర్లో ఇంగ్లాండ్‌ విజయానికి 10 బంతుల్లో 18 పరుగులు అవసరమైన దశలో మార్క్‌వుడ్‌ ఇచ్చిన క్యాచ్‌ను శార్దూల్‌ అందుకోలేకపోయాడు. ఆ తర్వాతి బంతికే కరన్‌ వికెట్ల వెనుక గాల్లోకి లేపిన బంతిని నటరాజన్‌ పట్టలేకపోయాడు. ఓ వైపు సహచర ఆటగాళ్లు ఫీల్డింగ్‌లో విఫలమైనప్పటికీ కెప్టెన్‌ కోహ్లి మాత్రం మరోసారి అద్భుత రీతిలో క్యాచ్‌ అందుకుని అబ్బురపరిచాడు. శార్దూల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 40వ ఓవర్‌ రెండో బంతికి రషీద్‌ ఇచ్చిన క్యాచ్‌ను కవర్స్‌లో ఉన్న కోహ్లి నమ్మశక్యంగా కాని విధంగా అందుకున్నాడు. తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని అంచనా వేసిన అతను.. తన ఎడమ వైపు డైవ్‌ చేస్తూ ఒంటిచేత్తో పట్టుకున్నాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని