close

తాజా వార్తలు

Updated : 08/04/2021 19:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రైనాలా.. భజ్జీ కీలకం!

హర్భజన్‌ అనుభవం విలువైందన్న ప్రజ్ఞాన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ అత్యంత కీలకమవుతాడని మాజీ క్రికెటర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా అంటున్నాడు. ముంబయి, చెన్నై తరఫున ఐపీఎల్‌ ట్రోఫీలు గెలిచిన అనుభవం అతడి సొంతమని వివరించాడు. ఒత్తిడిలో ఎలా నడిపించాలో అతడికి తెలుసన్నాడు. వ్యూహరచనలో మోర్గాన్‌ సేనకు భజ్జీ ఉపయోగపడతాడని వెల్లడించాడు. వ్యక్తిగత కారణాలతో గతేడాది హర్భజన్‌ చెన్నై తరఫున ఆడలేకపోయాడు. ఈసారి వేలంలో కనీస ధరకు అతడిని కేకేఆర్‌ సొంతం చేసుకుంది.

‘భజ్జీ ఎంతో అనుభవశాలి. ఎక్కువ క్రికెట్‌ ఆడినవారిని చూస్తే మనం హర్భజన్‌ కెరీర్‌ను తప్పక పరిశీలించాల్సి ఉంటుంది. ముంబయి, చెన్నై తరఫున అతడు ట్రోఫీలు గెలిచాడు. అతడు తీసుకొచ్చే అనుభవానికి ఎంతో విలువుంది. ఈడెన్‌లో అద్భుతాలు చేసిన అతడంటే కోల్‌కతాకు ఎంతో సంతోషం’ అని ప్రజ్ఞాన్‌ తెలిపాడు.

‘కరోనా వల్ల ఈ సారి జట్లకు సొంత మైదాన ప్రయోజనం దక్కడం లేదు. కానీ భజ్జీకి దేశవ్యాప్తంగా పేరుంది. అన్ని పిచ్‌ల గురించి అతడికి తెలుసు. ముంబయి బౌలింగ్‌ దళాన్ని అతడు నడిపించాడు. ఛాంపియన్‌షిప్‌లు గెలవడం అతడికి తెలుసు. యువకులకు అతడి అనుభవం ఉపయోగకరం. చెన్నైకి సురేశ్‌ రైనాలా భజ్జీ సైతం కోల్‌కతాకు ఎంతో కీలకం. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో అతడు చూపిస్తాడు. మోర్గాన్‌ సేన ప్లేఆఫ్స్‌ చేరుకోవాలంటే ప్రణాళికల్లో భజ్జీ భాగస్వామ్యం కచ్చితంగా అవసరం’ అని ప్రజ్ఞాన్‌ వివరించాడు. ఏప్రిల్‌ 11న కోల్‌కతా తన మొదటి పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఢీకొట్టనుంది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని