టీమ్‌ఇండియానే  ఫేవరెట్‌.. ఎందుకో తెలుసా?

తాజా వార్తలు

Updated : 31/01/2021 19:11 IST

టీమ్‌ఇండియానే  ఫేవరెట్‌.. ఎందుకో తెలుసా?

ఇంటర్నెట్‌డెస్క్‌: రాబోయే టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్‌ కన్నా టీమ్‌ఇండియానే ఫేవరెట్‌గా కనిపిస్తోందని ఆస్ట్రేలియా మాజీ సారథి ఇయాన్‌ ఛాపెల్‌ అన్నాడు. భారత్‌ ఇప్పుడున్న పరిస్థితుల్లో పటిష్ఠంగా ఉందని చెప్పాడు. దానికి తోడు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సైతం జట్టులో చేరడంతో మరింత బలోపేతమైందని అభిప్రాయపడ్డాడు. 

‘అన్ని అడ్డంకులు అధిగమించి టీమ్‌ఇండియా ఆస్ట్రేలియాపై చిరస్మరణీయ విజయం సాధించింది. ఇప్పుడు కోహ్లీ కూడా చేరడంతో మరింత బలంగా మారింది. ఇక రవిచంద్రన్‌ అశ్విన్‌, హార్దిక్‌ పాండ్య, ఇషాంత్‌ శర్మ లాంటి ఆటగాళ్లు ఈ సిరీస్‌కు ఎంపికైన నేపథ్యంలో భారత్‌ మరింత ప్రమాదకరంగా అనిపిస్తోంది. ఇటు ఇంగ్లాండ్‌ జట్టులో బెన్‌స్టోక్స్‌, జోఫ్రా ఆర్చర్‌ చేరికతో పేస్‌ విభాగం బలంగా కనిపిస్తోంది. అయితే, ఇంగ్లాండ్‌ టాప్‌ ఆర్డర్‌పైనే సందిగ్ధత నెలకొంది’ అని ఛాపెల్‌ పేర్కొన్నాడు. 

‘టీమ్‌ఇండియా టాప్‌ ఆర్డర్‌లో శుభ్‌మన్‌ గిల్‌, రోహిత్‌ శర్మ, ఛెతేశ్వర్‌ పుజారా ఉన్నారు. ఈ ముగ్గురూ ప్రస్తుతం బాగా ఆడుతున్నారు. అదే ఇంగ్లాండ్‌ జట్టు టాప్‌ ఆర్డర్‌లో రోరీ బర్న్స్‌ కొత్తగా చేరాడు. ఒకవేళ డామ్‌ సిబ్లీ, బర్న్స్‌ రాణించకపోతే కెప్టెన్‌ జోరూట్‌పై ఒత్తిడి పెరుగుతుంది. అలాగే శ్రీలంకలో విఫలమైన జాక్‌ క్రాలే ఇక్కడ రాణించాలి. అతడు నిలదొక్కుకునేందుకు ఇంతకన్నా మంచి అవకాశం ఉండదు. ఇంగ్లాండ్‌ పేస్‌ విభాగానికి వస్తే అనుభవజ్ఞులైన అండర్సన్‌, స్టువార్ట్‌బ్రాడ్‌ ఉన్నారు. వారికి తోడు ఆర్చర్‌ చేరడంతో భారత్‌ కన్నా కాస్త మెరుగ్గా అనిపిస్తోంది’ అని ఆసీస్‌ మాజీ సారథి వివరించాడు. 

ఇవీ చదవండి..
అది చరిత్ర.. ఇప్పుడు నేను కెప్టెన్‌ కాదు 
కోహ్లీ.. ఈ రికార్డులు కూడా కొట్టేసెయ్‌..!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని