WTC Finals: ఆరో రోజు నిబంధనలు ఇవే!

తాజా వార్తలు

Published : 28/05/2021 15:35 IST

WTC Finals: ఆరో రోజు నిబంధనలు ఇవే!

డ్రా అయితే రెండు జట్లు సంయుక్త విజేతలు

దుబాయ్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిఫ్‌ ఫైనల్స్‌ నిబంధనలను ఐసీసీ ప్రకటించింది. ఐదు రోజుల్లో ఫలితం తేలకుండా మ్యాచ్‌ డ్రా అయితే రెండు జట్లను సంయుక్త విజేతగా ప్రకటిస్తామని వెల్లడించింది. నిర్ణీత కాల వ్యవధిలో మ్యాచ్‌ పూర్తవ్వకపోతే, అడ్డంకులు ఎదురైతేనే నష్టపోయిన ఆటను ఆరో రోజు ఆడిస్తామని స్పష్టం చేసింది. షార్ట్‌ రన్‌ వంటి విషయాలను మూడో అంపైర్‌ చూసుకుంటారని తెలిపింది. జూన్‌ 18 నుంచి 22 వరకు సౌథాంప్టన్‌ వేదికగా భారత్‌, న్యూజిలాండ్‌ ఫైనల్స్‌లో తలపడే సంగతి తెలిసిందే.

* మ్యాచ్‌ డ్రాగా ముగిస్తే రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. మ్యాచ్‌ జరిగే ఐదు రోజుల్లో సమయం నష్టపోతేనే రిజర్వుడేను కేటాయిస్తారు.

* జూన 23 రిజర్వు డేగా ఉంటుంది. అదీ ఐదు రోజుల్లో ఫలితం తేలకుంటేనే. సాధారణ రోజుల్లో నష్టపోయే సమయాన్ని మాత్రమే ఉపయోగించుకుంటారు.

* ఐదు రోజుల్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తి స్థాయిలో ఆట జరిగితే ఆరో రోజు ఉండదు. ఫలితంతో దీనికి సంబంధం లేదు. అలాంటి పరిస్థితుల్లో మ్యాచ్‌ డ్రాగా ముగిసిందని ప్రకటిస్తారు.

* రిజర్వు డే ఉపయోగించుకోవాలా లేదా అన్నది మ్యాచ్‌ రిఫరీ నిర్ణయిస్తారు. అదీ ఐదో రోజు చివరి గంటలో సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంటారు.

* మ్యాచ్‌లో పూర్తిగా గ్రేడ్‌ 1 డ్యూక్‌ బంతుల్ని వినియోగిస్తారు.

* మైదానంలోని అంపైర్లు చెప్పగానే మూడో అంపైర్‌ షార్ట్‌రన్‌పై సమీక్షించి నిర్ణయం చెబుతారు. మిగతా ఎల్బీడబ్ల్యూ, డీఆర్‌ఎస్‌ నిబంధనలు ఎప్పటిలాగే ఉంటాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని