ఆసీస్‌ క్రికెటర్లను సొంతంగా చదివిన అజింక్య!

తాజా వార్తలు

Updated : 04/01/2021 13:30 IST

ఆసీస్‌ క్రికెటర్లను సొంతంగా చదివిన అజింక్య!

కోచ్‌ ప్రవీణ్‌ ఆమ్రె అభిప్రాయం

ముంబయి: రెండో టెస్టుకు ముందు ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ తీరును అజింక్య రహానె వ్యక్తిగతంగా అధ్యయనం చేసుంటాడని అతడి కోచ్‌ ప్రవీణ్‌ ఆమ్రె అన్నారు. మ్యాచ్‌ తొలి రోజే అశ్విన్‌ను ప్రయోగించడం తెలివైన ఎత్తుగడని ప్రశంసించారు. తొలి టెస్టులో కోహ్లీ రనౌట్‌కు కారుకుడై, తక్కువ పరుగులే చేసిన జింక్స్‌ తర్వాతి టెస్టుకు సారథ్యం వహిస్తుండటంతో కాస్త భయం వేసిందన్నారు. ఏదేమైనప్పటికీ మూడో టెస్టులో పుంజుకొనేందుకు ఆసీస్‌ విశ్వప్రయత్నం చేస్తుందని అంచనా వేశారు.

మెల్‌బోర్న్‌ టెస్టు వరకు రహానె ఫామ్‌లో లేడు. అంతకు ముందు న్యూజిలాండ్‌ సిరీసులో సత్తా మేరకు రాణించలేదు. గులాబి టెస్టులో జట్టు మెరుగ్గా ఉన్న స్థితిలో కోహ్లీ రనౌట్‌కు కారకుడయ్యాడు. అదే మ్యాచు రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. టీమ్‌ఇండియా ఓటమి పాలవ్వడంతో కోహ్లీ లేని భారత్‌ అస్సలు పుంజుకోలేదని ఆసీస్‌ మాజీలు అన్నారు. రెండో టెస్టులో రహానె అద్భుతంగా సారథ్యం వహించాడు. తెలివైన నిర్ణయాలు తీసుకున్నాడు. తొలిరోజు అశ్విన్‌తో బౌలింగ్‌ చేయించి లెగ్‌సైడ్‌లో ఫీల్డర్లను మోహరించాడు. ఉమేశ్‌ యాదవ్‌ లేకున్నా ఆ జట్టుపై ఒత్తిడి చేశాడు. కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడి శతకం అందుకున్నాడు.

‘ఆసీస్‌ సిరీసుకు ముందు న్యూజిలాండ్‌లో రహానె గొప్పగా పరుగులు చేయలేదు. అడిలైడ్‌లోనూ కోహ్లీ రనౌట్‌కు కారకుడయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో సున్నాకే వెనుదిరిగాడు. దాంతో నాకు ఆందోళన కలిగింది. వైఫల్యం వెంటనే నాయకత్వం వహించడం సాధారణ విషయం కాదు. మైదానంలో వేర్వేరు పరిస్థితుల్లో వేర్వేరు నాయకులు ఉంటారు. కానీ, చివరికి సమాధానం చెప్పాల్సింది మాత్రం సారథే. ఆ పాత్రను రహానె అద్భుతంగా పోషించాడు’ అని ఆమ్రె అన్నారు.

‘మెల్‌బోర్న్‌ టెస్టుకు ముందు ఆసీస్‌ బ్యాటింగ్‌ను రహానె బాగా అధ్యయనం చేసి ఉంటాడు. ఎందుకంటే ఆసీస్‌ ఆఫ్‌ స్పిన్‌ బౌలింగ్‌లో అంతగా ఆడలేదు. తొలిరోజు అశ్విన్‌తో బౌలింగ్‌ చేయించడమే మలుపు. దీనిని ఎవరూ ఊహించలేదు. సరైన ప్రాంతాల్లో ఫీల్డర్లను మోహరించి ఉక్కిరిబిక్కిరి చేశారు. మూడో టెస్టులో ఆసీస్‌ పుంజుకొనేందుకు ప్రయత్నిస్తుంది. టీమ్‌ఇండియా స్వేచ్ఛగా ఆడటంలో తప్పులేదు’ అని ప్రవీణ్‌ ఆమ్రె పేర్కొన్నారు.

ఇవీ చదవండి
రోహిత్‌శర్మ సహా.. అందరికీ కరోనా నెగెటివ్‌
సిరీస్‌ను బహిష్కరించే యోచనలో భారత్‌?

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని