close

తాజా వార్తలు

Updated : 26/02/2021 19:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భారత్‌ విజయంపై బ్రిటిష్‌ మీడియా అక్కసు

ఇంటర్నెట్‌డెస్క్‌: మొతేరా వేదికగా భారత్‌తో జరిగిన డే/నైట్ టెస్టులో ఇంగ్లాండ్ ఘోరపరాజయాన్ని చవిచూసింది. పది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అయితే టీమిండియా ఘన విజయంపై కొన్ని ప్రముఖ బ్రిటిష్ వార్తా సంస్థలు తమ అక్కసు వెల్లగక్కాయి. తమ జట్టు ఓటమికి స్పిన్‌ పిచ్‌ కారణమని, రెండు రోజుల్లోనే టెస్టు మ్యాచ్‌ ముగిసిందని రాసుకొచ్చాయి. భారత్‌ క్రీడాస్ఫూర్తి హద్దులు దాటుతుందని, ఇది అసలు టెస్టు క్రికెట్‌ కాదని నిందిస్తూ పేర్కొన్నాయి. స్వదేశంలో జరిగే సిరీస్‌లో ఆతిథ్య జట్టు అవకాశాలు తీసుకుంటుందని, కానీ ఈ పిచ్‌ అయిదు రోజులకు సరిపడేది కాదని వ్యాఖ్యానించాయి. 12-14 నెలల పాటు ఆ స్టేడియాన్ని నిషేధించాలని అతిగా వ్యాఖ్యలు చేశాయి.

అయితే మరికొన్ని బ్రిటిష్ వార్తా సంస్థలు ఇంగ్లాండ్ జట్టు పేలవ ప్రదర్శనే ఘోర ఓటమికి కారణమని ఒప్పుకున్నాయి. ఇంగ్లాండ్‌ బోర్డు అవలంబిస్తున్న రొటేషన్‌ పద్ధతిని తీవ్రంగా తప్పుబట్టాయి. కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిస్తున్నారని ఆరోపించాయి. రెండు రోజుల్లో చవిచూసిన ఘోర ఓటమికి సులువైన కారణాలు చెప్పడానికి వీల్లేదన్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో 74/2తో మంచి స్థితిలో ఉన్నా.. స్పిన్‌ను ఎదుర్కోలేక బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారన్నాయి. కేవలం ఒకే స్పిన్నర్‌, నలుగురు నంబర్‌.11 బ్యాట్స్‌మెన్‌తో బరిలోకి దిగారని విమర్శించాయి.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని