
తాజా వార్తలు
అంచనాలు వద్దు..ఒత్తిడి పెంచొద్దు: గంభీర్
ఇంటర్నెట్‌డెస్క్: టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు ఎంతో ప్రతిభ ఉందని మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ కొనియాడాడు. అయితే అతడిపై అంచనాలు పెంచి, అనవసర ఒత్తిడి కలిగించొద్దని అన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ సత్తాచాటిన సంగతి తెలిసిందే. మూడు టెస్టుల్లో 51 సగటుతో 259 పరుగులు చేశాడు. నిర్ణయాత్మక ఆఖరి టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో 91 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
‘‘గిల్‌కు ఎంతో ప్రతిభ ఉంది. కెరీర్లో అతడికి అదిరే ఆరంభం దక్కింది. అంతకంటే గొప్ప ఆరంభం లభించదు. ఆస్ట్రేలియాలో ఆడటం, సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అతడు అద్భుతంగా ఆడుతున్నాడు. నిలకడగా తన ప్రదర్శనను ఇలానే కొనసాగించాలి. అయితే అతడికి కాస్త సమయం ఇవ్వాలి. తన ఆటను అతడే మరింత మెరుగుపర్చుకోవాలి. అతడిపై అంచనాలు పెంచి, ఒత్తిడి తీసుకురావొద్దు. రోహిత్ శర్మతో గిల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. దీనిలో ఎలాంటి సందేహం లేదు. అయితే అంతర్జాతీయ క్రికెట్ అంత సులువుకాదు. మరింత శ్రమించాలి’’ అని గంభీర్ తెలిపాడు.
ఇదీ చదవండి
టీమిండియాను ఆయనే బలంగా తయారుచేశాడు..
ఎవరడిగినా భారతీయులమని గర్వంగా చెబుతాం..