INDvsSL: రెండు జట్లకు సమాన అవకాశాలు!
close

తాజా వార్తలు

Published : 18/07/2021 01:32 IST

INDvsSL: రెండు జట్లకు సమాన అవకాశాలు!

కొలంబో: ఆదివారం నుంచి ప్రారంభమయ్యే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమ్ఇండియా, శ్రీలంక జట్లకు సమాన అవకాశాలున్నాయని శ్రీలంక టీమ్‌ నూతన కెప్టెన్‌ దాసున్‌ షనక విశ్లేషించాడు. తొలి వన్డేకు ముందు మీడియాతో ముచ్చటించిన అతడు.. రెండు జట్లూ సమానంగా తలపడతాయని అంచనా వేశాడు. టీమ్‌ఇండియా యువ క్రికెటర్లతో ఫేవరెట్‌గా కనిపిస్తున్నా అందులో కొంతమంది అంతర్జాతీయ క్రికెట్‌ ఆడలేదన్నాడు.

‘రెండు జట్లూ ఈ టోర్నీని సమానంగా ప్రారంభిస్తాయి. ఎందుకంటే టీమ్‌ఇండియా ఈసారి యువ క్రికెటర్లతో ఇక్కడికి వచ్చింది. అందులోని ఆటగాళ్లంతా ఐపీఎల్‌లో బాగా ఆడినా.. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడలేదనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటప్పుడు రెండు జట్లకూ సమాన అవకాశాలు ఉంటాయి’ అని షనక అభిప్రాయపడ్డాడు. మరోవైపు శుక్రవారం రాత్రే శ్రీలంక జట్టును ప్రకటించిన నేపథ్యంలో ఇలాంటి పరిస్థితుల్లో టీమ్‌ఇండియాతో ఆడటం కలిసి వస్తుందా అని అడిగిన ప్రశ్నకు అతడు ఔననే సమాధానం చెప్పాడు.

‘అవును, ఈ టీమ్‌ఇండియాతో తలపడటం మాకు కాస్త కలిసివస్తుందనే చెప్పాలి. ఎందుకంటే ఆ జట్టు అంతర్జాతీయ క్రికెట్‌లో మా యువకులు ఎలా ఆడతారో చూడలేదు. మేం కూడా అంతే. ఇలాంటి పరిస్థితుల్లో భారత ఆటగాళ్లు సరైన సన్నద్ధతతో బరిలోకి దిగాలి’ అని శ్రీలంక నూతన సారథి వివరించాడు. మరోవైపు వరుస ఓటములతో సతమవుతున్న శ్రీలంక జట్టును కొత్త కెప్టెన్‌గా ముందుకు నడిపించడం ఎలా ఉంటుందని అడిగిన ప్రశ్నకు అది సవాళ్లతో కూడుకున్నదని పేర్కొన్నాడు. ‘కెప్టెన్‌గా ఉండటం ఎప్పటికీ సవాళ్లతో కూడుకున్నదే. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎలా ఉంటుందో తెలిసిందే. ఇంటా బయటా (ఆన్‌ఫీల్డ్‌, ఆఫ్‌ ఫీల్డ్‌) అనేక సమస్యలు ఉంటాయి. ఏదేమైనా ఆటగాళంతా ఒక జట్టుగా ఆడి మంచి ప్రదర్శన చేయాలి. టీమ్‌ఇండియాతో మా క్రికెటర్లు బాగా ఆడతారని ఆశిస్తున్నా’ అని శ్రీలంక కెప్టెన్‌ వివరించాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని