close

తాజా వార్తలు

Updated : 01/03/2021 16:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జడేజా ఆ విషయం ఆలోచిస్తుండొచ్చు.! 

టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌పై గావస్కర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ సందర్భంగా గాయపడిన టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా గాయం నుంచి ఇంకా ఎందుకు కోలుకోలేదనే విషయంపై ఆలోచిస్తుండొచ్చని మాజీ సారథి సునీల్‌ గావస్కర్‌ అన్నాడు. ఓ క్రీడా ఛానెల్‌తో గావస్కర్‌, ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు గ్రేమ్‌ స్వాన్‌ మాట్లాడుతున్న సందర్భంగా వ్యాఖ్యాత జడేజా, అక్షర్‌పటేల్‌ పై ఓ ప్రశ్న వేశారు. పింక్‌బాల్‌ టెస్టులో యువ స్పిన్నర్‌ అక్షర్‌ 11 వికెట్లు తీసినా తర్వాతి మ్యాచ్‌కు జడ్డూ కోలుకొని జట్టులోకి వస్తే ఏమిటని అడిగారు. దీనికి తొలుత స్పందించిన టీమ్‌ఇండియా దిగ్గజం ఇలా చెప్పుకొచ్చాడు.

‘తన చేతి వేలికి ఏమైందనే విషయంపై జడేజా ఇప్పుడు ఆలోచిస్తుండొచ్చు. ఇన్ని రోజులు గడుస్తున్నా ఇంకా తన వేలు ఎందుకు నయం కాలేదని వైద్యుడిని అడుగుతుండవచ్చు. సిడ్నీ టెస్టు సందర్భంగా జనవరి 10న అతడికి గాయమైంది. ఇప్పుడు ఫిబ్రవరి గడిచిపోయింది. ఇన్ని రోజులైనా ఇంకా ఎందుకు కోలుకోలేదోనని ఆశ్చర్యపోతుండొచ్చు’ అని బ్యాటింగ్‌ దిగ్గజం పేర్కొన్నాడు. ఇక స్వాన్‌ మాట్లాడుతూ.. ‘నేను జడ్డూకు వీరాభిమానిని. ఇప్పటికే అక్షర్‌ ఎలా ఆడాడో చూశాం. ఇప్పుడతడికి ఒక వారం విశ్రాంతినిచ్చి జడ్డూకు అవకాశమివ్వాలి. ఎందుకంటే అక్షర్‌ నుంచి తగినంత మంచి ప్రదర్శన మనం చూశాం’ అని వివరించాడు.

ఇక అక్షర్‌ గురించి మాట్లాడిన గావస్కర్‌.. గత రెండు టెస్టుల్లో పిచ్‌ అతడికి సహకరించిందని చెప్పాడు. అయితే, తనకు వచ్చిన అవకాశాన్ని ఈ యువ స్పిన్నర్‌ బాగా ఉపయోగించుకున్నాడని తెలిపాడు. తన శక్తిమేరకు బాగా బౌలింగ్‌ చేశాడని, సరైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌లో బంతులు సంధించడంతో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాడన్నాడు. ఆ క్రమంలోనే పలువురు బ్యాట్స్‌మెన్‌ వికెట్ల ముందు దొరికిపోయారన్నాడు. కాగా, చెన్నైలో జరిగిన రెండో టెస్టులో అరంగేట్రం చేసిన అక్షర్‌ తొలి మ్యాచ్‌లోనే ఏడు వికెట్లు పడగొట్టాడు. ఇక గతవారం జరిగిన పింక్‌బాల్‌ టెస్టులో మొత్తం 11 వికెట్లు తీశాడు. దీంతో మూడో టెస్టులో ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు. 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని