India vs Srilanka: జలకాలాటలలో.. గబ్బర్‌ సేన!

తాజా వార్తలు

Published : 02/07/2021 11:40 IST

India vs Srilanka: జలకాలాటలలో.. గబ్బర్‌ సేన!

ఇంటర్నెట్‌ డెస్క్‌: శ్రీలంకలో పర్యటిస్తున్న భారత జట్టు క్వారంటైన్‌ ముగిసింది. ఆటగాళ్లు తిరిగి ఒకర్నొకరు కలుసుకొనేందుకు అవకాశం లభించింది. తమకు దొరికిన అవకాశాన్ని యువ క్రికెటర్లు అద్భుతంగా ఉపయోగించుకుంటున్నారు. వినూత్నమైన ఆటలు ఆడుతున్నారు. గురువారం సాయంత్రం క్రికెటర్లంతా ఈత కొలనులో సందడి చేశారు. బంతాట ఆడారు. అంతేకాకుండా కేరింతలు కొడుతూ ఫొటోలకు పోజులిచ్చారు.

జట్టులో ఆటగాళ్ల మధ్య బంధం పెంచేందుకు బీసీసీఐ ఇలా చేస్తోంది. క్రికెటర్లను ఒక్క దగ్గరకు చేర్చి వారితో ఉల్లాసవంతమైన క్రీడలు ఆడిస్తోంది. ఇందుకు సంబంధించిన చిత్రాలను బీసీసీఐ ట్విటర్లో పంచుకుంది. ‘క్వారంటైన్‌ నుంచి బయటకొచ్చిన ఆనందంలో.. నవ్వులే నవ్వులు.. త్వరలోనే మరో సరదా వీడియో రాబోతోంది’ అని వ్యాఖ్య జత చేసింది.

భారత్‌ తొలిసారి రెండు దేశాల్లో వేర్వేరు జట్లతో తలపడుతున్న సంగతి తెలిసిందే. సీనియర్లతో కూడిన జట్టు ఇంగ్లాండ్‌లో ఉండగా.. యువకులతో కూడిన జట్టు శ్రీలంకకు వచ్చింది. టీమ్‌ఇండియా వాల్‌, రాహుల్‌ ద్రవిడ్‌ ఈ బృందానికి కోచ్‌గా ఉన్నాడు. శిఖర్‌ ధావన్‌ కెప్టెన్‌, భువనేశ్వర్‌ కుమార్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. జులై 13 నుంచి సిరీస్‌ ఆరంభం కాబోతోంది. ఆతిథ్య జట్టుతో యువ భారత్‌ 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది.





Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని