Tokyo Olympics: సింధూ కాంస్యమైనా గెలిచేనా?

తాజా వార్తలు

Published : 01/08/2021 16:30 IST

Tokyo Olympics: సింధూ కాంస్యమైనా గెలిచేనా?

టోక్యో: ఈసారి ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధిస్తుందని ఆశించిన తెలుగు తేజం పీవీ సింధు శనివారం సెమీఫైనల్స్‌లో నిరాశపర్చిన సంగతి తెలిసిందే. ఆమె చైనీస్‌ తైపీ క్రీడాకారిణి తై జు యింగ్‌ చేతిలో 18-21, 12-21 తేడాతో ఓటమిపాలైంది. దాంతో ఈసారి ఒలింపిక్స్‌లో అత్యున్నత పతకం సాధించాలని ఆశించిన కల అలాగే మిగిలిపోయింది. కాగా, సింధు ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైనా ఒలింపిక్స్‌లో మరో పతకం సాధించే అవకాశం ఉంది. అది మరికాసేపట్లో జరిగే కాంస్యం పోటీల్లో చైనా క్రీడాకారిణి హి బింగ్జియావోపై విజయం సాధించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సింధు ఇక్కడైనా విజయం సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని