అవసరమైతే ఆఖరి టెస్టులో నేనుంటా: వీరూ

తాజా వార్తలు

Published : 13/01/2021 01:37 IST

అవసరమైతే ఆఖరి టెస్టులో నేనుంటా: వీరూ

ఇంటర్నెట్‌డెస్క్: భారత జట్టుకు గాయాల బెడద వీడట్లేదు. ఆస్ట్రేలియా పర్యటన ఎంపిక నుంచి ఇప్పటివరకు దాదాపు 13 మంది ఆటగాళ్లు గాయపడ్డారు. మూడో టెస్టులో ఏకంగా అయిదుగురు ఆటగాళ్లు గాయాల బాట పట్టారు. సిడ్నీ మైదానంలో రిషభ్ పంత్‌, హనుమ విహారి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రాకు గాయాలైన సంగతి తెలిసిందే.

అయితే వాళ్లలో బుమ్రా, విహారి, జడేజా నాలుగో టెస్టుకు దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించగా.. పంత్‌, అశ్విన్‌ ఫిట్‌నెస్‌పై స్పష్టత లేదు. దీంతో ఆఖరి టెస్టులో భారత జట్టు కూర్పు ఎలా ఉంటుందోని క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా గాయాలపై దిగ్గజ బ్యాట్స్‌మన్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఫన్నీగా ట్వీట్ చేశాడు.

బుమ్రా, షమి, ఉమేశ్‌‌, కేఎల్ రాహుల్, జడేజా, విహారి టెస్టు సిరీస్‌కు దూరమయ్యారని తెలుపుతూ సెహ్వాగ్‌ ఓ ఫోటోను పోస్ట్ చేశాడు. దానికి.. ‘ఎంతో మంది ఆటగాళ్లు గాయపడ్డారు. అయితే నాలుగో టెస్టుకు 11 మంది లేకపోతే చెప్పండి. జట్టులో చేరడానికి నేను సిద్ధంగా ఉన్నా. క్వారంటైన్‌ నిబంధనలు గురించి తర్వాత ఆలోచిద్దాం’’ అని సరదాగా వ్యాఖ్య జత చేశాడు. ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ప్రస్తుత పరిస్థితుల్ని వ్యంగ్యంగా విశ్లేషిస్తూ నెట్టింట్లో సెహ్వాగ్‌ చురుకుగా ఉంటాడన్న విషయం తెలిసిందే. కాగా, జనవరి 15న బ్రిస్బేన్‌ వేదికగా భారత్‌×ఆసీస్‌ ఆఖరి టెస్టు ప్రారంభం కానుంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి.

ఇదీ చదవండి

బాబోయ్‌.. టీమిండియా పరిస్థితేంటి?

మన క్రికెటర్లకి.. అంతా బంగారు తల్లులే


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని