close

సత్తాచాటిన రుచిత, లలిత్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: లియో జూనియర్స్‌ టెన్నిస్‌ టోర్నీలో రుచిత వున్నం, లలిత్‌ మోహన్‌ సత్తాచాటారు. అండర్‌-14, అండర్‌-16 బాలికల టైటిళ్లను రుచిత గెలుచుకోగా.. బాలుర టైటిళ్లను లలిత్‌ సొంతం చేసుకున్నాడు. ఆదివారం లింగంపల్లిలోని లియో టెన్నిస్‌ అకాడమీలో జరిగిన అండర్‌-14 బాలికల సింగిల్స్‌ ఫైనల్లో రుచిత 6-3 తేడాతో నవ్యపై విజయం సాధించింది. అండర్‌-16 తుదిపోరులో రుచిత 6-0తో నవ్యపై గెలిచి ట్రోఫీ అందుకుంది. అండర్‌-16 బాలుర ఫైనల్లో లలిత్‌ మోహన్‌ 6-2తో చేతన్‌ చౌదరిపై గెలిచాడు. అండర్‌-14 మ్యాచ్‌లో లలిత్‌ 6-4తో రిత్విక్‌పై నెగ్గి టైటిల్‌ కైవసం చేసుకున్నాడు. అండర్‌-10 బాలికల సింగిల్స్‌లో ఆరుషి, బాలుర సింగిల్స్‌లో సాయి సూర్య, అండర్‌-12 బాలికల సింగిల్స్‌లో హరిణి, బాలుర సింగిల్స్‌లో ప్రత్యూష్‌ విజేతలుగా నిలిచారు.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.