close
దినేశ్‌ కార్తీక్‌.. మ్యాచ్‌ ఫినిషర్‌

కోల్‌కతా: వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ మరోసారి మ్యాచ్‌ ఫినిషర్‌ పాత్ర పోషిస్తాడని ఆ జట్టు సహాయక కోచ్‌ సైమన్‌ కటిచ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రపంచకప్‌ దృష్ట్యా ఐపీఎల్‌లో సత్తాచాటి దినేశ్‌ టీమ్‌ఇండియా తుదిజట్టులోకి ఎంపికయేందుకు ప్రయత్నిస్తాడని కటిచ్‌ చెప్పాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో ఆడే అవకాశం రాని దినేశ్‌.. ఆ సిరీస్‌లో రిషబ్‌ విఫలం కావడంతో అతని స్థానంలో ప్రపంచకప్‌కు ఎంపికయ్యే అవకాశం ఉంది. ‘‘ఒత్తిడిలోనూ గొప్పగా ఆడిన అనుభవం దినేశ్‌ సొంతం. టీమ్‌ఇండియాతో పాటు ఐపీఎల్‌లోనూ అతను ఫినిషర్‌ పాత్రను సమర్థంగా పోషించాడు. క్రీజులో కుదరుకుంటే అతనికి బౌలింగ్‌ చేయడం చాలా కష్టం. అతను ప్రపంచకప్‌ రేసులో ఉన్నాడు. ప్రపంచకప్‌ జట్టుకు ఎంపికవడం కోసం తీవ్ర పోటీ నెలకొంది. భారత సెలక్టర్లకు జట్టు ఎంపిక పరీక్షగా మారింది’’ అని కటిచ్‌ తెలిపాడు. యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ త్వరలోనే టీమ్‌ఇండియాలో సుస్థిర స్థానం సాధిస్తాడని కటిచ్‌ చెప్పాడు. ‘‘తొందర్లోనే శుభ్‌మన్‌ టీమ్‌ఇండియాలో సుస్థిర స్థానం సాధిస్తాడని కచ్చితంగా చెప్పగలను. అతనిలో నైపుణ్యం ఉంది. గతేడాది ఐపీఎల్‌లో గొప్పగా రాణించాడు. భారత్‌పై వన్డే సిరీస్‌ నెగ్గేందుకు ఆస్ట్రేలియా తీవ్రంగా శ్రమించింది. వాళ్ల ఆటతీరు అద్భుతం. విజయానికి ఆ జట్టు అర్హమైంది. టాప్‌ఆర్డర్‌ మంచి ప్రదర్శన చేసింది. ముఖ్యంగా ఖవాజా, టర్నర్‌ గొప్పగా ఆడారు. ప్రపంచకప్‌కు ముందు వార్నర్‌, స్మిత్‌ చేరికతో జట్టు బలోపేతం కానుంది. గత కొన్ని నెలలుగా ఆస్ట్రేలియా ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. అయితే ప్రపంచకప్‌కు ముందు జట్టు తిరిగి గాడిన పడడం ఆనందించే విషయం’’ అని కటిచ్‌ పేర్కొన్నాడు.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.