close
హసీబ్‌ అజేయ శతకం

యంగ్‌స్టర్స్‌ గెలుపు
ఎ3-డివిజన్‌ వన్డే లీగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: హసీబ్‌ (120 నాటౌట్‌) అజేయ శతకంతో చెలరేగడంతో ఎ3-డివిజన్‌ వన్డే లీగ్‌ క్రికెట్లో ఆడమ్స్‌ ఎలెవన్‌పై పీఎన్‌ యంగ్‌స్టర్స్‌ పైచేయి సాధించింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో యంగ్‌స్టర్స్‌ 170 పరుగుల ఆధిక్యంతో ఆడమ్స్‌పై గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన యంగ్‌స్టర్స్‌ 45 ఓవర్లలో 5 వికెట్లకు 268 పరుగులు సాధించింది. శ్రీకాంత్‌ (53) అర్ధ సెంచరీతో రాణించాడు. అనంతరం ఆడమ్స్‌ 30 ఓవర్లలో 98 పరుగులకు ఆలౌటైంది. నర్సింహ (4/33), మీర్‌ సమీ అలీ (3/10) సత్తాచాటి యంగ్‌స్టర్స్‌కు విజయాన్ని అందించారు.

* ఎ3-డివిజన్‌ వన్డే లీగ్‌: బీ పీఎన్‌ యంగ్‌స్టర్స్‌: 268/5 (శ్రీకాంత్‌ 53, హసీబ్‌ 120 నాటౌట్‌, బిలాల్‌ 30), ఆడమ్స్‌ ఎలెవన్‌: 98 (నర్సింహ 4/33, మీర్‌ సమీ అలీ 3/10), బీ విజయ్‌పురి విలొమెన్‌: 225 (దీపాంషు 67, అయాన్‌ అహ్మద్‌ 71 నాటౌట్‌, రామ్‌    4/31), సాగర్‌ సీసీ: 133 (ప్రణయ్‌ 39, అయూబ్‌ఖాన్‌ 7/30)

* అండర్‌-16 వన్డే లీగ్‌ కం నాకౌట్‌: సెయింట్‌ మేరీస్‌ జూనియర్‌ కళాశాల (బషీర్‌బాగ్‌): 113 (జాఫరుల్లాఖాన్‌ 51, వంశీరెడ్డి 4/13), లిటిల్‌ ఫ్లవర్‌ జూనియర్‌ కళాశాల (ఉప్పల్‌): 114/0 (రవి 60 నాటౌట్‌, మాల్విక్‌రెడ్డి 37),
* అక్షర ఇంటర్నేషనల్‌ స్కూల్‌: 66/5 (విఘ్నేష్‌రెడ్డి 48 నాటౌట్‌), శ్రీనిధి ఇంటర్నేషనల్‌ స్కూల్‌: 67/0 (యశ్‌ 36 నాటౌట్‌),
* ఖమ్మం జిల్లా: 58 (రజాక్‌ 3/11), ఆల్‌ సెయింట్స్‌ హైస్కూల్‌: 59/1,
* గ్రీన్‌విచ్‌ అకాడమీ స్కూల్‌: 41, హెచ్‌పీఎస్‌-ఆర్‌: 44/1 (దుర్గ బాలాజీ 38 నాటౌట్‌),
* ఎస్‌పీఆర్‌ జూనియర్‌ కళాశాల: 77, భవన్స్‌ శ్రీఅరబిందో జూనియర్‌ కళాశాల: 78/0 (నిశాంత్‌యాదవ్‌ 43 నాటౌట్‌),
* శ్రీఆకర్ష్‌ జూనియర్‌ కళాశాల: 127/4 (యశ్‌రాజ్‌ 38), ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ (ఖాజాగూడ): 98/8 (కుశ్‌ అగర్వాల్‌ 30, యశ్‌రాజ్‌ 3/17),
* శ్రీచైతన్య జూనియర్‌ కళాశాల (రామాంతపూర్‌): 89/7 (రిషిత్‌రెడ్డి 37), మహబూబ్‌నగర్‌ జిల్లా: 90/5 (డేవిడ్‌ 34),
* మెదక్‌ జిల్లా: 105/6, సెయింట్‌ ఆంథోనీస్‌ హైస్కూల్‌: 83 (ఆదిత్య 35, పునీత్‌ 4/10, తరుణ్‌ 3/19)

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.