
తొలి టీ20కి బ్యాటింగ్ పిచ్ సిద్ధం
హైదరాబాద్ చేరుకున్న కోహ్లి సేన
ఈనాడు - హైదరాబాద్
బంగ్లాదేశ్‌తో గులాబి బంతి సంబరం ముగిసిన 12 రోజుల్లోనే పరుగుల పండుగ వచ్చేసింది. టీమ్ఇండియా, వెస్టిండీస్‌ల మధ్య టీ20 సిరీస్ నేపథ్యంలో పరుగుల తుపానుకు రంగం సిద్ధమైంది. 3 మ్యాచ్‌ల పొట్టి సిరీస్‌లో మొదటి పోరు హైదరాబాద్‌లోనే. ఈనెల 6న ఉప్పల్ స్టేడియంలో టీమ్ఇండియా.. విండీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ఇరు జట్లూ ఈ సిరీస్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. పొట్టి కప్‌కు మంచి సన్నాహంగా దీన్ని భావిస్తున్నాయి. ఈ సిరీస్‌లో పరుగుల వరద ఖాయమన్నది విశ్లేషకుల అంచనా. తొలి మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న ఉప్పల్ స్టేడియంలో పరుగుల ఉప్పెన పక్కా అన్నది స్టేడియం వర్గాల సమాచారం.
సిరీస్ తొలి మ్యాచ్‌పై అందరి దృష్టి ఉండటంతో టీమ్ఇండియాకు కలిసొచ్చే పిచ్‌నే ఇవ్వాలని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) నిర్ణయించినట్లు తెలిసింది. పిచ్‌పై పచ్చికను పూర్తిగా తొలగించి బ్యాటింగ్‌కు అనుకూలంగా మార్చినట్లు సమాచారం. హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్‌కు పరిపాలకుడిగా ఇదే తొలి మ్యాచ్ కావడంతో అతను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఈనెల 11న అజహర్ కొడుకు అసదుద్దీన్‌కు, సానియా మీర్జా చెల్లెలు ఆనమ్ మీర్జాలకు హైదరాబాద్‌లోనే వివాహం జరగనుంది. ఓవైపు పెళ్లి పనులు చూసుకుంటూనే.. మరోవైపు మ్యాచ్ ఏర్పాట్లను అజహర్ పర్యవేక్షిస్తున్నాడు. పిచ్, ఔట్‌ఫీల్డ్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించాడు. సోమవారం రాత్రి వర్షం కురిసిన నేపథ్యంలో గ్రౌండ్స్‌మెన్‌కు అజహర్ జాగ్రత్తలు చెప్పాడు. పిచ్ గురించి ఇరు జట్లూ సానుకూలంగా మాట్లాడితే, ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా గెలిస్తే పరిపాలకుడిగా తనకు శుభారంభం లభించినట్లేనని అజ్జూ భావిస్తున్నాడు. ఇక ఉప్పల్ స్టేడియంలో టీమ్ఇండియా అయిదు టెస్టులాడగా.. నాల్గింట్లో నెగ్గింది. ఒక మ్యాచ్ డ్రా అయింది. ఆరు వన్డేల్లో మూడింట్లో గెలిచి.. మూడింట్లో ఓడింది. 2017 అక్టోబరులో టీమ్ఇండియా, ఆస్ట్రేలియాల మధ్య టీ20 మ్యాచ్ వర్షార్పణమైంది. తర్వాత ఇక్కడ జరుగుతున్న టీ20 మ్యాచ్ ఇదే.
సిరీస్ తొలి మ్యాచ్ కోసం టీమ్ఇండియా, వెస్టిండీస్ జట్లు హైదరాబాద్ చేరుకున్నాయి. అఫ్గానిస్తాన్‌తో టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌ల కోసం నెల కిందట్నుంచే భారత్‌లోనే ఉన్న విండీస్ జట్టు సోమవారమే హైదరాబాద్‌కు వచ్చింది. మంగళవారం ఉప్పల్ స్టేడియంలో జట్టంతా ప్రాక్టీస్ చేసింది. కెప్టెన్ కీరన్ పొలార్డ్ నేతృత్వంలో ఆటగాళ్లు 3 గంటల పాటు సాధన చేశారు. ఇటీవల అఫ్గాన్‌తో ముగిసిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను విండీస్ 1-2తో కోల్పోవడం గమనార్హం. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ తర్వాత దాదాపు 10 రోజులు విరామం తీసుకున్న టీమ్ఇండియా ఆటగాళ్లు మంగళవారం విడివిడిగా హైదరాబాద్ చేరుకున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్‌శర్మతో సహా ఆటగాళ్లంతా వచ్చేశారు. బుధవారం ఉప్పల్ స్టేడియంలో సాధన చేయనున్నారు.
‘‘కఠినమైన ప్రత్యర్థితో ఆడబోతున్నాం. మేం అండర్డాగ్సే కావొచ్చు కానీ మన ప్రతిభపై మనకు నమ్మకముంటే, సత్తా మేరకు ఆడితే ఏదైనా సాధ్యమే’’
- కీరన్ పొలార్డ్
|
ప్రధానాంశాలు
దేవతార్చన

- అరలీటర్ వాటర్ బాటిల్ రూ.60 ఇదేం న్యాయం?
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- పునర్నవికి ఝలక్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్
- లింగాపూర్ బాధితురాలి పేరు 'సమత'గా మార్పు
- దర్శకుల్ని ఎంపిక చేయడమే కష్టమైంది
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- అతను నా తండ్రి కాదు: హేడెన్ వాల్ష్
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- పాక్క్రికెట్ను బాగుచేసే మంత్రదండం లేదు