
ప్రధానాంశాలు
గబ్బాలో కొత్త హీరోలు
శార్దూల్, సుందర్ అద్భుత పోరాటం
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 336 ఆలౌట్
ఆసీస్ ఆధిక్యం 33కు పరిమితం
ఓవర్‌నైట్ స్కోరు 62/2తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్.. 186కే 6 వికెట్లు కోల్పోయింది. అప్పటికీ ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 183 పరుగులు వెనకబడే ఉంది. క్రీజులో చూస్తేనేమో తొలిసారి టెస్టుల్లో బ్యాటింగ్ చేస్తున్న వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ ఉన్నారు. బలమైన ఆసీస్ బౌలింగ్ దళాన్ని ఎదుర్కోలేక ప్రధాన బ్యాట్స్‌మెన్ పెవిలియన్ చేరిన నేపథ్యంలో.. ఈ కొత్త జోడీ ఎంతసేపు ప్రతిఘటించగలదు..? ఆధిక్యం 150 దాకా సమర్పించుకోక తప్పదా..? అన్న అనుమానాలు! సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే నాలుగో టెస్టు చేజారే సంకేతాలు! కానీ సుందర్, శార్దూల్ గబ్బాలో అద్భుతమే చేశారు. మేటి బ్యాట్స్‌మెన్‌కు పరీక్ష పెట్టే పరిస్థితుల్లో అదిరే బ్యాటింగ్‌లో కంగారూలకు షాకిచ్చారు. ఇద్దరూ అర్ధశతకాలు సాధించి, 123 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును పోటీలో నిలిపారు. వీళ్ల అద్వితీయమైన ప్రదర్శన కారణంగా తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ కేవలం 33 పరుగుల ఆధిక్యమే సాధించగలిగింది.
బ్రిస్బేన్
బోర్డర్- గావస్కర్ సిరీస్‌లో చివరిదైన నాలుగో టెస్టులో టీమ్ఇండియా అనూహ్యంగా పుంజుకుంది. ఈ మ్యాచ్‌తోనే టెస్టు అరంగేట్రం చేసిన సుందర్ (62; 144 బంతుల్లో 7×4, 1×6), రెండో టెస్టు మాత్రమే ఆడుతున్న శార్దూల్ (67; 115 బంతుల్లో 9×4, 2×6) టాప్ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కంటే ఎంతో మెరుగ్గా బ్యాటింగ్ చేసి ఆస్ట్రేలియాకు ఆధిపత్యం చలాయించే అవకాశం లేకుండా చేశారు. వీళ్ల పోరాట ఫలితంగా ఆదివారం తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 336 పరుగులు చేయగలిగింది. కెప్టెన్ రహానె (37)తో సహా మయాంక్ (38), పుజారా (25), పంత్ (23) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. హేజిల్‌వుడ్ (5/57) భారత్‌ను దెబ్బ తీశాడు. స్టార్క్ (2/88), కమిన్స్ (2/94) కూడా రాణించారు. 33 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా 6 ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా 21 పరుగులు చేసి మూడో రోజును ముగించింది. వార్నర్ (20), హ్యారిస్ (1) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతానికి ఆ జట్టు 54 పరుగుల ఆధిక్యంలో ఉంది.
బాగానే ఆరంభించినా..: పుజారా (ఓవర్‌నైట్ స్కోరు 8), రహానె (ఓవర్‌నైట్ స్కోరు 2) మూడో రోజు ఆటను మెరుగ్గానే ఆరంభించారు. గంటకు పైగా ప్రత్యర్థి బౌలర్లను నిలువరించారు. క్రీజులో పాతుకుపోయి పరుగులు రాబట్టే ప్రయత్నం చేశారు. మూడో వికెట్‌కు 45 పరుగులు జోడించిన ఈ జంట కుదురుగా ఆడుతుండడంతో ఇన్నింగ్స్ సాఫీగానే సాగుతుందనిపించింది. కానీ హేజిల్‌వుడ్.. పుజారాను ఔట్ చేయడంతో కథ అడ్డం తిరిగింది. మంచి లెంగ్త్‌లో ఆఫ్‌స్టంప్‌పై పడ్డ బంతిని ఆడడంలో పుజారా మరోసారి తన బలహీనత బయటపెట్టి పెవిలియన్ చేరాడు. అయిదో స్థానంలో వచ్చిన మయాంక్‌తో కలిసి ఇన్నింగ్స్ నడిపించేలా కనిపించిన రహానె.. స్టార్క్ చేతికి చిక్కడంతో జట్టు 161/4తో లంచ్ విరామానికి వెళ్లింది. మయాంక్, పంత్ కలిసి జట్టును కాపాడతారనుకుంటే.. హేజిల్‌వుడ్ వాళ్లను స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేర్చి భారత్‌ను గట్టి దెబ్బ తీశాడు.
అనూహ్యంగా ఆ ఇద్దరూ..: ఇంకా దాదాపు రెండు సెషన్ల ఆట మిగిలి ఉంది. త్వరగా 4 వికెట్లు పడగొట్టి.. మంచి ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభిద్దామనుకున్న ప్రత్యర్థి ఆశలకు సుందర్, శార్దూల్ గండి కొట్టారు. మొండి పట్టుదలతో ధైర్యంగా క్రీజులో నిలిచి అత్యుత్తమ బౌలింగ్ దళాన్ని సమర్థంగా ఎదుర్కొన్నారు. సుందర్ క్రీజులో కుదురుకునేందుకు సమయం తీసుకోగా.. కమిన్స్ బౌలింగ్‌లో సిక్సర్‌తో పరుగుల ఖాతా తెరిచిన శార్దూల్ మాత్రం ధాటిగానే ఇన్నింగ్స్ మొదలెట్టాడు. ఎలాంటి తడబాటు లేకుండా బ్యాటింగ్ కొనసాగించిన ఈ జోడీ అలవోకగా పరుగులు రాబట్టింది. ఈ జోడీని విడగొట్టడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కొత్త బంతిని కూడా ఉత్తమంగా ఆడి పరుగులు సాధించారు. దీంతో జట్టు టీ విరామానికి 253/6తో నిలిచింది. మూడో సెషన్లో స్కోరు వేగాన్ని పెంచిన ఈ భారత జోడీ.. ఆసీస్ ఆధిక్యాన్ని క్రమంగా తగ్గిస్తూ వచ్చింది. ఇద్దరూ అర్ధశతకాలు పూర్తి చేశారు. ఏడో వికెట్‌కు భాగస్వామ్యం 123 పరుగులకు చేరింది. ఆ దశలో భారత్.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరును దాటుతుందనిపించింది. కానీ ఓ మంచి బంతితో శార్దూల్‌ను బౌల్డ్ చేసిన కమిన్స్ వాళ్ల పోరాటానికి తెరదించాడు. కాసేపటికే సైని (5), సుందర్ వరుస ఓవర్లలో పెవిలియన్ చేరడంతో త్వరగానే భారత ఇన్నింగ్స్ ముగిసింది.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 369
భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (సి) స్టార్క్ (బి) లైయన్ 44; శుభ్‌మన్ గిల్ (సి) స్మిత్ (బి) కమిన్స్ 7; పుజారా (సి) పైన్ (బి) హేజిల్‌వుడ్ 25; రహానె (సి) వేడ్ (బి) స్టార్క్ 37; మయాంక్ (సి) స్మిత్ (బి) హేజిల్‌వుడ్ 38; పంత్ (సి) గ్రీన్ (బి) హేజిల్‌వుడ్ 23; సుందర్ (సి) గ్రీన్ (బి) స్టార్క్ 62; శార్దూల్ (బి) కమిన్స్ 67; సైని (సి) స్మిత్ (బి) హేజిల్‌వుడ్ 5; సిరాజ్ (బి) హేజిల్‌వుడ్ 13; నటరాజన్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం: (111.4 ఓవర్లలో ఆలౌట్) 336;
వికెట్ల పతనం: 1-11, 2-60, 3-105, 4-144, 5-161, 6-186, 7-309, 8-320, 9-328;
బౌలింగ్: స్టార్క్ 23-3-88-2; హేజిల్‌వుడ్ 24.4-6-57-5; కమిన్స్ 27-5-94-2; గ్రీన్ 8-1-20-0; లైయన్ 28-9-65-1; లబుషేన్ 1-1-0-0
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: హ్యారిస్ బ్యాటింగ్ 1; వార్నర్ బ్యాటింగ్ 20; మొత్తం: (6 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా) 21; బౌలింగ్: సిరాజ్ 2-1-12-0; నటరాజన్ 3-0-6-0; సుందర్ 1-0-3-0
2
అరంగేట్ర టెస్టు ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీయడంతో పాటు అర్ధశతకం చేసిన రెండో భారత ఆటగాడు సుందర్. అతని కంటే ముందు దత్తు ఫాడ్కర్ (1947/48) ఆ ఘనత సాధించాడు.
3
అరంగేట్ర టెస్టులో ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసి అత్యధిక పరుగులు చేసిన మూడో భారత ఆటగాడు సుందర్. ద్రవిడ్ (95), బాపు నాద్కర్ణి (68) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
ప్రధానాంశాలు
సినిమా
- పంత్ ‘GOAT’ అవుతాడు: దాదా
- యువతిపై 60 మంది అత్యాచారం!
- నేనున్నానని..
- ఏసీబీకి చిక్కిన ‘ఉత్తమ సర్పంచి’
- బైక్ ఎక్కిన కృతి.. పుస్తకం పట్టిన కాజోల్
- చెల్లి పెళ్లికి అధిక కట్నం ఇస్తున్నారని అక్కసు!
- రివ్యూ: పవర్ ప్లే
- ఎన్ని పరుగులు చేశావన్నది మాత్రమే కాదు..
- విమానం బయల్దేరే ముందు షాకిచ్చాడు..
- 75వ స్వాతంత్య్ర దినోత్సవాలకు జాతీయ కమిటీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
