close

ప్రధానాంశాలు

Published : 05/03/2021 01:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఒకే ఓవర్లో పొలార్డ్‌ 6, 6, 6, 6, 6, 6

కూలిడ్జ్‌: వెస్టిండీస్‌ వీరుడు కీరన్‌ పొలార్డ్‌ సంచలనం సృష్టించాడు..  శ్రీలంకతో తొలి టీ20లో చెలరేగిన ఈ కెప్టెన్‌ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో యువరాజ్‌ సిక్సర్ల తర్వాత.. ఆ ఘనత సాధించిన తొలి ఆటగాడు పొలార్డే. మొత్తం మీద అంతర్జాతీయ క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు బంతులను మైదానం బయటకు పంపిన మూడో ఆటగాడు అతను. 2007 వన్డే ప్రపంచకప్‌లో ఆ ఘనత సాధించిన దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గిబ్స్‌ తొలి స్థానంలో ఉన్నాడు.
పాపం అఖిల: ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు మాత్రమే కాదు.. ఈ మ్యాచ్‌లో ఓ హ్యాట్రిక్‌ కూడా నమోదైంది. హ్యాట్రిక్‌ తీశాననే ఆనందం లంక స్పిన్నర్‌ అఖిల ధనంజయ (3/62)కు  మిగలకుండా అతని ఓవర్లోనే పొలార్డ్‌ (38;   11 బంతుల్లో 6×6) విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ 4 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట లంక 9 వికెట్లకు 131 పరుగులు చేయగా.. విండీస్‌ 6 వికెట్లు కోల్పోయి విండీస్‌ 13.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. సిమన్స్‌ (26), లూయిస్‌ (28) విరుచుకుపడడంతో విండీస్‌ 3.1 ఓవర్లలోనే 50 పరుగులు దాటింది. అయితే ఆ తర్వాతి మూడు బంతులకు ధనంజయ వరుసగా.. లూయిస్‌ (28), గేల్‌ (0), పూరన్‌ (0)ను ఔట్‌ చేసి హ్యాట్రిక్‌ సాధించాడు. అలాంటి పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన పొలార్డ్‌ ఎదురుదాడికి దిగాడు. అఖిల వేసిన ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్లో పొలార్డ్‌ తన బలంతో ఆరు సిక్సర్లు రాబట్టాడు. ఆ తర్వాతి ఓవర్లోనే అతను ఔటైనా.. చివరి వరకూ క్రీజులో నిలబడ్డ హోల్డర్‌ (29 నాటౌట్‌) సిక్సర్‌తో మ్యాచ్‌ ముగించాడు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన