భారత్‌-పాక్‌సిరీస్‌ మళ్లీ?
Array ( ) 1

ప్రధానాంశాలు

Published : 25/03/2021 01:44 IST

భారత్‌-పాక్‌సిరీస్‌ మళ్లీ?

కరాచి: భారత్‌, పాకిస్థాన్‌ మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతోందంటే రెండు దేశాల అభిమానులతో పాటు ప్రపంచం దృష్టి దానిపైనే ఉంటుంది. అదే ఈ రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ జరిగితే.. ఆ సిరీస్‌లో దాయాది దేశంపై టీమ్‌ఇండియా విజయం సాధిస్తే వచ్చే కిక్కే వేరుగా ఉంటుంది. కానీ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా చాలా ఏళ్ల నుంచి ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు లేవు. కేవలం ఐసీసీ టోర్నీల్లో, ఆసియా కప్‌లో మాత్రమే ఈ రెండు జట్ల పోరాటం చూసే అవకాశముంటోంది. కానీ ఈ రెండు జట్లు ఈ ఏడాదిలో ఓ సిరీస్‌లో తలపడబోతున్నాయనే వార్త ఒకటి ఇప్పుడు హల్‌చల్‌ చేస్తోంది. 2021 ద్వితీయార్థంలో రెండు జట్ల మధ్య టీ20 సిరీస్‌ జరిగే అవకాశాలున్నట్లు పాక్‌ స్థానిక మీడియాలో కథనం వచ్చింది. ఈ ఏడాదిలో భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌కు సిద్ధంగా ఉండాలని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)కు ఆ దేశ ప్రభుత్వ ఉన్నత వర్గాల నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం. ఓ పీసీబీ అధికారి దాన్ని స్పష్టం చేశాడు. మరోవైపు తమ దేశంలో 2023లో నిర్వహించే ఆసియా కప్‌లో భారత్‌ ఆడుతుందనే ఆశాభావాన్ని పీసీబీ ఛైర్మన్‌ మని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చివరగా 2012-13లో పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం భారత్‌లో పాక్‌ పర్యటించింది. 2008లో ఆసియా కప్‌ కోసం టీమ్‌ఇండియా.. పాక్‌కు వెళ్లింది. చివరగా ఈ రెండు జట్లు 2019 వన్డే ప్రపంచకప్‌లో తలపడ్డాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన